Gandi babji says jagan will trust no one

gandi babji on ys jagan, gandi babji latest comments, gandi babji resigns ysr congress, ysr congress leaders, ysr congress latest updates, ys jagan latest, ys jagan case, ys jagan family, andhrapradesh politics, andhrapradesh latest news

gandi babji says jagan will trust no one : gandi babji leader from vishakapatnam resigns to ysr congress party and alleges that ys jagan will trust no one even they are believed persons. because of jagan behaviour and attitude all leaders coming out from party

ఆయనో మోనార్క్.. ఎవరినీ నమ్మడు

Posted: 10/31/2014 10:24 AM IST
Gandi babji says jagan will trust no one

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ జిల్లా నేత గండి బాబ్జి విమర్శలు చేశారు. జగన్ ఎవరిని నమ్మరని ఆరోపించారు. పార్టీపై, నాయకుడిపై నేతలు ఎంత విశ్వాసంగా ఉన్నప్పటికీ.. జగన్ మాత్రం ఎవరిని నమ్మరని ద్వజమెత్తారు. వైసీపీకి గురువారం రోజు గండిబాబ్జి రాజీనామా చేశారు. కొణతాలపై జగన్ వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు విశాఖ జిల్లా నేతలు కొణతాలతో నడుస్తామని ప్రకటించారు. జగన్ వైఖరికి నిరసనగా కొణతాల సోదరుడు రఘునాధ్, 20మంది సర్పంచ్ లు, 28మంది ఎంపీటీసీలు ఇరత నేతలు గురువారం రోజు పార్టిని వీడినట్లు తెలుస్తోంది.

జగన్ వైఖరిని నిరసిస్తూనే విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత కొణతాల రామకృష్ణ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే రామకృష్ణను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కనీసం చర్చలు జరపకుండా పార్టీ నుంచి తొలగించటంపై తీవ్రంగా స్పందించిన ఆయన తరపు నేతలు.. మూకుమ్మడిగా బయటకు వచ్చేశారు. దీంతో జిల్లాలో వైసీపీ పట్టు తప్పినట్లు అయింది. కొణతాల రాజీనామా సందర్బంగా కూడా జగన్ వైఖరిపై ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇంటిముందు బానిసలా నిలబడలేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే చాలామంది నేతలు జగన్ వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నుంచి బయటకు వచ్చేవారంతా జగన్ వైఖరి, వ్యవహార శైలిని ప్రధానంగా విమర్శిస్తున్నారు. నేతలతో వ్యవహరించే తీరు, వారిని చూసే విధానంను తప్పుబడుతున్నారు. ఇంత జరుగుతున్నా జగన్ వైఖరిలో మార్పు రాకపోతే..,  మిగతావారు కూడా పార్టీని వీడవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని నేతల పట్ల మంచిగా వ్యవహరిస్తే బాగుంటుంది. అలా కాకుండా నేను మోనార్క్ ను ఎవరినీ నమ్మను అంటే.. మొదటికే మోసం వస్తుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gandi babji  ys jagan  ysr congress  latest news  

Other Articles