Kurnool jmj school teacher beaten student for wearing ayyappa clothes

kurnool jmj school, kurnool town news, kurnool town news, teacher beaten student, kurnool crime news, kurnool schools

kurnool jmj school teacher beaten student for wearing ayyappa clothes

టీచర్ పైశాచికత్వం.. అయ్యప్పమాలతో వచ్చాడని చితక్కొట్టింది!

Posted: 11/01/2014 03:00 PM IST
Kurnool jmj school teacher beaten student for wearing ayyappa clothes

రానురాను పాఠశాలల్లో వున్న టీచర్ల ఆకృత్యాలు మరింతగా పెచ్చుమీరిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. మగాళ్లు అమ్మాయిలమీద మృగాల్లా వ్యవహరిస్తుంటే.. మహిళా టీచర్లు అబ్బాయిలపై తమ పైశాచికత్వాన్నిప్రదర్శిస్తున్నారు. ఇక విషయానికొస్తే.. తాజాగా కర్నూలు నగరంలోని ఓ స్కూల్ టీచర్ అబ్బాయి కేవలం అయ్యప్ప మాలతో వేసుకొచ్చాడని చితకబాదేసింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇటువంటి దుస్తులు స్కూలుకు వేసుకోరాకూడదని పేర్కొంటూ మరీ విద్యార్థిని కొట్టిందట సదరు మేడమ్!

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు నగరంలోని జెఎంజె స్కూలులో చదువుకుంటున్న ఒక విద్యార్థి శనివారం (01-11-2014) రోజు అయ్యప్పమాలతో స్కూలుకి వెళ్లాడు. అయితే అతను వేసుకున్న ఆ దుస్తుల్ని చూసి టీచర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వెంటనే ఇంటికెళ్లి దుస్తులు మార్చుకుని రావాలంటూ ఆమె హుకుం జారీ చేసింది. అయితే అందుకు ఆ విద్యార్థి ఒప్పుకోకపోవడంతో ఆమె బెత్తం తీసుకుని అతనిని చితకబాదేసింది. తనలో వున్న మొత్తం ఆగ్రహాన్ని సదరు టీచర్ ఆ విద్యార్థిపై బెత్తంతో ప్రదర్శించింది. ఆమె బాదిన బాదుడుకు విద్యార్థిని గాయాలవడంతో అతను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి, జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.

దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థి తల్లిదండ్రులు, వీహెచ్పీ నేతలతోపాటు కార్యకర్తలు స్కూలుకు చేరుకుని క్షమాపణలు చెప్పాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్  చేశారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో వారికి కోపం కట్టలు తెంచుకుంది. తరగతి గదుల్లోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జేఎంజే స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి చేరుతుందో చూడాలి!!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kurnool town  teacher beaten students  kurnool schools  telugu news  

Other Articles