Virgin galactic s spaceshiptwo crashes after anomaly during test killing one

Virgin Galactic, spacecraft, carry tourists, crash, Mojave desert, “in-flight anomaly”, test flight, Stuart Witt, chief executive of Mojave Air and Space Port

Virgin Galactic’s SpaceShipTwo crashes after ‘anomaly’ during test, killing one

కుప్పకూలిన స్పేస్‌షిప్..అమెరికాకు రెండో ఎదురుదెబ్బ..

Posted: 11/02/2014 12:51 PM IST
Virgin galactic s spaceshiptwo crashes after anomaly during test killing one

అమెరికా అంతరిక్ష్ ప్రయోగాలకు ప్రతికూల ఫలితాలు సవాల్ విసురుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అందరికన్నా ముందున్న అగ్రరాజ్యం అమెరికా.. ప్రయోగాలు చేపట్టాలంటేనే జంకుతున్న పరిణామాలు త్పన్నమవుతున్నాయి. గత మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరకులను మోసుకెళుతున్న ఆర్బిటల్ సైన్సెస్ రాకెట్ ప్రయోగం చేసిన కొన్ని గడియల్లోనే కుప్పకూలింది. అయితే అది మానవ రహిత విమానం కాబ్బట్టి ఎలాంటి ప్రాణనష్టం లేకుండా పోయింది.

కానీ తాజాగా చేపట్టిన స్పేస్ షిఫ్ టూ అనే వ్యోమనౌక కూడా కప్పుకూలడంతో అమెరికా అంతరిక్ష ప్రయోగాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రోదసిలోకి పర్యాటకులను చేరవేసేందుకు ఉద్దేశించిన 'స్పేస్‌షిప్ టూ' వ్యోమనౌక నేల కూలింది. అందులోని పైలట్ దుర్మరణం పాలయ్యారు. మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. కాలిఫోర్నియాలోని మొజావీ ఎడారిలో ఈ వ్యోమనౌకను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నప్పుడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ వ్యోమనౌక భవితపై సందేహాలు మొదలయ్యాయి.

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ వ్యోమనౌకను రూపొందించింది. దీన్ని వైట్‌నైట్ టూ అనే భారీ విమానంపై అమర్చారు. విమానాన్ని 45వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లి వ్యోమనౌకను విడుదల చేశారు. రాకెట్ ఇంజిన్‌ను పరీక్షించడం దీని ఉద్దేశం. రెండు నిమిషాల తర్వాత వ్యోమనౌకలో లోపం తలెత్తి, అది పేలిపోయింది. స్పేస్‌షిప్ టూ ద్వారా అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు దాదాపు 500 మంది సీట్లు బుక్ చేసుకున్నారు. స్పేస్‌షిప్ టూ ఆరుగురు వ్యోమగాములను మోసుకెళ్లగలదు. 2015లో ఇది సిద్ధమవుతుందని భావించారు. కానీ ఇప్పడు దీని అంతరిక్ష యాత్రపై నీలినీడలు కమ్మకుంటున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles