ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఏపీ ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ మద్యం కొరతను అధిగమించేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు పచ్చజెండా వూపింది. అదేసమయంలో ప్రస్తుత డిస్టిలరీల మద్యం ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు కూడా అనుమతించింది.
సామర్థ్యం అధికంగా ఉన్న డిస్టిలరీలు తెలంగాణలో ఉండటంతో.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగంతో పోలిస్తే సరఫరా తక్కువగా ఉంది. సగటున ప్రతినెలా 54 నుంచి 72 లక్షల లీటర్ల (6 లక్షల నుంచి 8 లక్షల కేస్‌లు- కేస్‌కు 9 లీటర్లు) వరకు కొరత ఏర్పడింది. ఈ ప్రభావం మద్యం అమ్మకాలపై పడటంతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గినట్లు ఎక్సైజ్‌శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29 డిస్టిలరీలు ఉండేవి. ఇందులో తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్‌లో 14. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి, నాచారం తదితర ప్రాంతాల్లోని డిస్టిలరీల ఉత్పత్తి సామర్థ్యం భారీగా ఉండటంతో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో కొరత ఉన్నా.. తెలంగాణలోని డిస్టిలరీల నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోలు చేసి జిల్లాల్లోని మద్యం డిపోలకు సరఫరా చేసేది. దీంతో సమస్య ఉండేదికాదు.
విభజన నేపథ్యంలో అక్కడినుంచి మద్యం దిగుమతి చేసుకోవాలంటే తెలంగాణలో ఎగుమతి, ఏపీలో దిగుమతి రుసుము చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రుసుము లీటర్‌కు నాలుగు నుంచి ఆరు రూపాయలదాకా ఉంది. దిగుమతి పన్ను మినహాయిస్తామని ఏపీ సర్కారు ప్రతిపాదించినా, ఎగుమతి పన్ను మినహాయించేందుకు తెలంగాణ సర్కారు ముందుకు రాలేదని తెలిసింది. దీంతో రెండు రకాల పన్నుల భారాన్ని భరించేందుకు డిస్టిలరీల యజమానులు ముందుకు రాకపోవడంతో మద్యం లోటు కొనసాగుతూ వచ్చింది. సెలవు రోజుల్లో అదనపు గంటల్లో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ వచ్చినా ఫలితం కొంతమేరకే వచ్చినట్లు ఎక్సైజ్‌వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి వంద రోజుల ప్రణాళికలోనే ఎక్సైజ్‌శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. మద్యం లోటును అధిగమించేందుకు ప్రస్తుత డిస్టిలరీల సామర్థ్యం పెంచేందుకు అనుమతించాలని.. లేదంటే, కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతివ్వాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కొత్త డిస్టిలరీల ఏర్పాటుతోపాటు, ఉన్నవాటి సామర్థ్యం పెంచడం ద్వారా మద్యంలోటును పూర్తిస్థాయిలో అధిగమించేందుకు ప్రభుత్వం ఈ రెండు నిర్ణయాలు తీసుకొంది. ఇప్పటికే ఉన్న డిస్టిలరీల సామర్థ్యం పెంచేందుకు అనుమతించిన ప్రభుత్వం అదనపు కోటా ఉత్పత్తికి సంబంధించిన రుసుముల్ని కూడా పెంచింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more