Over 200 nigerian schoolgirls kidnapped by boko haram have been married off

Nigeria, 200 schoolgirls, kidnap, Boko Haram, married off, Abubakar Shekau, remote Nigerian town, Chibok, April, marital homes, laugh, no going back, long ago

Over 200 Nigerian schoolgirls kidnapped by Boko Haram have been married off

కిడ్నాప్ చేసిన 200 మంది అమ్మాయిలను పెళ్లాడిన దుష్టుడు..

Posted: 11/02/2014 01:25 PM IST
Over 200 nigerian schoolgirls kidnapped by boko haram have been married off

ఉగ్రవాదుల దుశ్చర్యలకు అది అంతూ అంటూ లేకుండా పోతోంది. వారి ఉద్యమాలు దారి తప్పతున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారో.. కనీసం ఉగ్రవాద నేతలకైనా అర్థమవుతుందో..? లేదో..? విధ్వంసాల నుంచి వారు కూడా అమ్మాయిలను, మహిళలను టార్గెట్ చేసే దారుణానికి ఒడిగడుతున్నారు. కిడ్నాప్ చేసి.. వారి మాన ప్రాణాలతో వ్యాపారం చేస్తూ వికటాటహాసం చేస్తున్నారు. కనీసం చిన్న పిల్లలను కూడా వదలిపెట్టకుండా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.

నైజీరియాలో ఏప్రిల్‌లో ఉగ్రవాదులు అపహరించుకుపోయిన బాలికల విడుదల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. 200 మందికి పైగా బాలికలను ఇస్లాం మతంలోకి మార్చామని, వారిని తానే పెళ్లాడానని నైజీరియా ఉగ్రవాద సంస్థ 'బోకో హరమ్' నాయకుడు అబూబకర్ షెకావు ఒక వీడియోలో చెప్పాడు. ఆపహరించుకువచ్చిన ఆ బాలికల సంగతి తాను ఎప్పుడో మరచిపోయానని. వాళ్లను చాన్నాళ్ల క్రితమే తాను పెళ్లాడానని తెలిపాడు.

ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతడు వీడియోలో నవ్వుతూ కనిపించాడు. ఏప్రిల్‌లో ఈశాన్య నైజీరియాలోని మారుమూల పట్టణం చిబోక్‌లో ఒక బోర్డింగ్ స్కూల్‌లో పరీక్షలు రాస్తుండగా 276 మంది బాలికలను బోకో హరమ్ ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. పలువురు బాలికలు ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకొని వచ్చారు. 219 మంది ఆచూకీ మాత్రం తెలియడం లేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles