Suicide attack in wagah border kills morethan 55 people

suicide attack in wagah border kills morethan 55 people : At least 55 people were killed and more than 150 injured in a lethal suicide attack on the Pakistan side of Wagah border. Banned terrorist organization Jundullah claims responsible for suicide attack

శవాల దిబ్బగా వాఘా బార్డర్.. బీ.ఎస్.ఎఫ్. హై అలర్ట్

Posted: 11/03/2014 09:58 AM IST
Suicide attack in wagah border kills morethan 55 people

పాకిస్థాన్ లోని వాఘా సరిహద్దు ప్రాంతం ఆదివారం నెత్తురొడింది. పాక్ వైపు ఉన్న లాహర్ లో వాఘా సరిహద్దులో శక్తివంతమైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 55మంది దుర్మరణం చెందగా వందమందకి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. సరిహద్దులో సాయంత్రం సైనిక విన్యాసాలు పూర్తయి పతాక అవనతం చేసిన కొద్దిసేపటికే ఈ పేలుడు జరిగింది. భారీ సంఖ్యలో ఉన్న జన సమూహమే లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన పేలుడుతో శవాలు చెల్లాచెదురయ్యాయి. దీంతో సరిహద్దు ప్రాంతం శవాల దిబ్బగా మారింది.

ఈ పేలుడు ధాటికి సమీపంలోని షాపులు ద్వంసం అయ్యాయి. భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసకున్న సైనికులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టార. పేలుడు తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ మారణఖాండకు కారణం తామే అని ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జున్దుల్లాహ్ ప్రకటించుకుంది. అటు మరో ఉగ్రవాద సంస్థ జమాత్ అహ్రద్ కూడా ఈ దాడికి తామే కారణం అని ప్రకటించుకోవటం గమనార్హం. వజీరిస్థాన్ లోని మిలిటరీ ఆపరేషన్లకు వ్యతిరేకంగా ఈ దాడి చేసినట్లు ముష్కరులు ప్రకటించారు.

పేలుడు ప్లాన్ ఇలా

భారత్ లోని అమృత్ సర్ పాక్ లోని లాహోర్ మద్య ఉన్న రోడ్డు మార్గమే వాఘా సరిహద్దు. ఈ గేటు ను ప్రతి రోజూ సాయంత్రం వరకు తెరచి ఉంచి సాయంత్రం పతాక అవనతం చేసిన తర్వాత సైనిక విన్యాసాలతో గేట్లు మూసేస్తారు. ఈ విన్యాసాలు చూసేందుకు ఇరు వైపుల నుంచి వేల సంఖ్యలో ప్రజలు సరిహద్దుకు తరలివస్తారు. దీంతో ఇక్కడ పేలుడు జరిపితే రెండు దేశాల ఆర్మీకి హచ్చరిక చేసినట్లు అవుతుందని ఉగ్రవాదులు భావించారు. అయితే పకడ్బంది భద్రత ఉండే ఇక్కడ పేలుడు జరపటం కష్టం కావటంతో పరేడ్ గ్రౌండ్ బయటకు వెళ్లే మార్గం వద్ద అంతా బయటకు రాగానే పేలుడు జరిపారు. 20ఏళ్ళ వయస్సున్న ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు జరుపుకున్నట్లు పోలిసులు భావిస్తున్నారు. భద్రతా సిబ్బంది బాంబర్ ను గుర్తించి అడ్డుకునే లోపే తనను తాను పేల్చేసుకున్నాడు.

బీఎస్ఎఫ్ హై అలర్ట్

భారత్- పాక్ సరిహద్దుగా ఉన్న వాఘాలో పేలుడు జరగటంతో మనదేశ సరిహద్దు రక్షణా ధళం అప్రమత్తమైంది. సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది. విషయం తెలిసిన వెంటనే గస్తీని పెంచటంతో పాటు మూడ్రోజుల పాటు సైనిక విన్యాసాలు రద్దు చేశారు. ఫిరోజ్ పూర్ లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఈ మద్య ఇంటలిజెన్స్ హెచ్చరించటంతో పాటు తాజా పేలుడు నేపథ్యంలో విన్యాసాలు రద్దు చేశారు. అటు ఈ పేలుడులో మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్రమోడి సంతాపం తెలిపారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles