Wagah suicide attack did bomber plan to detonate in india

Wagah, Suicide attacks, Pakistan, Wagah suicide attack, Intelligence authorities, defuse, more bombs, Wagah border

Wagah suicide attack: Did bomber plan to detonate in India?

తాను తీసిన గోతిలోనే పడిన పాకిస్థాన్..

Posted: 11/04/2014 03:51 PM IST
Wagah suicide attack did bomber plan to detonate in india

పాకిస్థాన్ ఉగ్రవాదులు గోతిలో వారే పడ్డారు. అంతా అయ్యాక దాయాది చేశం భారత్ కోసం ఇది మనం తీసుకున్న గొయ్యే అంటూ నాలుక కర్చుకున్నారు.. వాఘా సరిహద్దు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన దాడికి పాల్పడ్డ ఆత్మాహుతి దళ సభ్యుడి లక్ష్యం భారతేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సదరు ఆత్మాహుతి దళ సభ్యుడి అంచనాలో చోటుచేసుకున్న చిన్నపొరపాటు కారణంగా పేలుడు పాక్ భూభాగంలో జరిగిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాఘా సరిహద్దు వద్ద ఉగ్రవాదులు రచించిన దాడి విఫలమై, సొంత దేశ జనాన్నే పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఆ తరహాలోనే మరిన్ని దాడులు భారత భూభాగంలో జరిగే ప్రమాదం లేకపోలేదని కూడా ఆ వర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి.

పేలుడు జరిగిన మరుసటి రోజు పెద్ద సంఖ్యలో సిక్కులు పాక్ నగరం లాహోర్ సమీపంలోని గురు నానక్ మందిరాన్ని దర్శించుకునేందుకు వెళతారు. వీరిని లక్ష్యంగా చేసుకుని దాడి జరపాలని తొలుత భావించినా, సదరు బాంబర్ ఒకరోజు ముందుగానే పాక్ భూభాగంలో తనను తాను పేల్చుకున్నాడనడానికి తగిన ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సోమవారం భారత్, పాకిస్థాన్ కు చెందిన బలగాలు వాఘా సరిహద్దులో అనేక బాంబులను కనుగోని నిర్వీర్యం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power crisis  Telangana  small problem  will sought it out  ap cm chandrababu  AP CM  Tour  Bangalore  

Other Articles