Pakistani mob fatally beats christian couple

Pakistan, Police, eyewitnesses, eastern Pakistan, angry crowd, attack,, beat, married Christian couple, death, accuse, desecrating Quran, burn, brick kiln, Kot Radha Kishan, Lahore

Pakistani Mob Fatally Beats set abalze Christian Couple

పాకిస్థాన్ లో దారుణం.. క్రైస్తవ జంట సజీవదహనం..

Posted: 11/05/2014 11:28 AM IST
Pakistani mob fatally beats christian couple

పాకిస్థాన్ లో దారుణం జరిగింది. ఊగిడం చేయడం లేదన్న అక్కస్సుతో తమ వద్ద పనిచేస్తున్న ఓ క్రైస్తవ జంటపై ఆ యజమాని దొంగదెబ్బ తీశారు. వారిని సజీవంగా మట్టుబెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. తమ పవిత్రగ్రంధం ఖురాన్‌ను కించపరిచారంటూ ఆరోపిస్తూ ముస్లింలు.. ఓ క్రిస్టియన్ జంటను చితకబాది సజీవ దహనం చేసిన ఘటన మంగళవారం పాకిస్థాన్‌లో జరిగింది. లాహోర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాసుర్ జిల్లాలోని కోట్ రాధా కిషన్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే అటవికంగా సాగిన ఈ దారుణం వెనుక మరో వాస్తవ కోణం దాగుని వుందంటున్నారు మృతుల బంధువులు..

FAISALABAD PAKISTAN Christian Couple

బాధితుల బంధువు ఇమ్మానుయెల్ సర్ఫరాజ్ మాట్లాడుతూ.. తమ బంధువులు షాహ్జా మాసి(35), ఆయన భార్య షామా(31)లు కొంతకాలంగా ఇక్కడికి సమీపంలో ఉన్న ఛక్ గ్రామంలో మహ్మద్ యూసుఫ్ గుజ్జార్ వద్ద సున్నంబట్టీలో పని చేస్తున్నారన్నారు. ఆ జంట నలుగురి పిల్లలతో కలిసి సున్నంబట్టీ వదిలి వెళ్లడానికి నిర్ణయించగా యూసుఫ్ వారికి జీతాన్ని చెల్లించకుండా, పైగా ఇక్కడి నుంచి వెళ్లాలంటే వారే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. దీనిపై వారి మధ్య వాదప్రతివాదాలు కూడా జరిగాయన్నారు.

అయితే వారు అక్కడి నుంచి ఎలాగైన వెళ్లిపోతారని తెలిసన యజమాని యూసుప్ గుజ్జార్ .. క్రైస్తవ జంటను రెండు రోజుల కిందట ఓ గదిలో నిర్బంధించారని ఇమ్మానుయెల్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఖురాన్‌ను దూషిస్తూ దానిని దహనం చేశారని ప్రార్థనం సమయంలో మసీదులో ఆయన ప్రచారం చేయడంతో.. పలువురు మత పెద్దల నాయకత్వంలో ముస్లిం యువకులు వారిని గదినుంచి బయటకులాగి ప్రాణాలు పోయేలా దాడి చేశారని. ఆ తరువాత వారిద్దరిని సున్నం బట్టిలో వేసి దహనం చేశారని మృతుల బంధువు ఇమ్మానుయెల్ తెలిపాడు. ఈ సమాచారాన్ని ఆందుకున్న పోలీసులు ఆ సమయంలో అక్కడికి వచ్చినా దాన్ని ఆపలేదని ఆయన ఆరోపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles