Iit kharagpur student gets rs 91 lakh job offer

IIT Kharagpur, Rs 91-lakh, job offer, student, IIT officials, pre-placement offers, companies, package, 20 per cent, Rs 91 lakh, Google Mountain View, Facebook, Works Application, IIT Kharagpur, final placements, December 1

IIT Kharagpur student gets Rs 91-lakh job offer

ఖరగ్ పూర్ విద్యార్థికి బంఫర్ ఆపర్.. నెలకు రూ.91 లక్షల వేతనం..

Posted: 11/05/2014 12:31 PM IST
Iit kharagpur student gets rs 91 lakh job offer

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థుల పంట పండుతోంది. ఫైనల్ ప్లేస్‌మెంట్లలకు ఇంకా నెల రోజుల సమయం మిగిలి వుండగానే వారికి ఉద్యోగ ఆఫర్లు వచ్చిపడుడున్నాయి. అది ఏదో సాధారణ వేతనాలతో కాదు.. భారీ వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది కంటే సుమారు 20 శాతం అధిక వేతనంతో విద్యార్థులకు పలు సంస్థలు ఆఫర్ లను ఇస్తున్నాయి. గత చరిత్రను తిరగరాస్తూ.. ఒక విద్యార్థికి ఏటా రూ.91 లక్షల ప్యాకేజీ అవకాశం లభించిందని ఇదే ఇప్పటి వరకు వచ్చిన బంపర్ ఆపర్ అంటూ ఐఐటీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికి దాదాపు 125 మంది విద్యార్థులకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చాయని ఐఐటీ అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేతనాలు 20 శాతం అధికం ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద ప్యాకేజీ ఏడాదికి రూ.91 లక్షలని వెల్లడించారు. గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలేగాక ఈ-కామర్స్ రంగానికి చెందిన అనేక కంపెనీలు ఈసారి ఆకర్షణీయమైన వార్షిక వేతనాలతో ముందుకొచ్చాయన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులకు ఫైనల్ ప్లేస్‌మెంట్లు డిసెంబరు 1 నుంచి మొదలుకానున్నాయి. ఫైనల్ ప్లేస్ మెంట్లలోపు 50 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వచ్చిపడుతున్నాయని ఐఐటీ వర్గాలు తెలిపాయి.

గతం తరహాలో కేవలం సాప్ట్ వేర్ సంస్థలే కాకుండా ఈ కామెర్స్ సంస్థలు, విదేశీ పెట్టుబడులకు చెందిన సంస్థలు, వెంచర్ కాపిటలిస్ట్ సంస్థలు విద్యార్థులకు బంపర్ ఆఫర్ లను ఇవ్వడంలో పోటీపడ్డాయన్నారు. ఇదే ఒరవడి కొనసాగితే రానున్న కాలంటో విద్యార్థులకు మంచి భవిష్యత్ వుంటుందని ఐఐటీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. ముందస్తు ఉద్యోగావకాశాల కోసం అనేక సంస్థలు, విభిన్న రంగానికి చెందిన కంపెనీలు అనేకం పోటీ పడటాన్ని హర్షనీయమని ఐఐటీ వర్గాలు తెలిపారు
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles