Goa chief minister manohar parrikar to resign today parsekar likely to succeed him

Goa chief minister Manohar Parrikar to resign today, may be inducted into the rajya sabha from uttar pradesh, Parsekar likely to succeed him

Goa chief minister Manohar Parrikar to resign today, Parsekar likely to succeed him

సీఎం పదవికి నేడు పారికర్ రాజీనామా, కొత్త సీఎంగా పర్సేకర్..

Posted: 11/08/2014 12:00 AM IST
Goa chief minister manohar parrikar to resign today parsekar likely to succeed him

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రక్షణ మంత్రిత్వ శాఖను ఆయన చేపడతారని వార్తలు వినబడుతున్నాయి. ఇవాళ జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఆయన.. గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పారికర్ ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశముందని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.. త్వరలోనే ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, శనివారం సాయంత్రం గోవా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని మనోహర్ పారికర్ తెలిపారు.

అయితే గోవాకు కో్త్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఇవాళ జరగనున్న బీజేపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఈ పదవిని భర్తీ చేయడానికి బీజేపీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టేసింది. ముఖ్యమంత్రి పదవికి తాను ఇవాళ రాజీనామా చేయనున్నట్లు మనోహర్ పారిక్కర్ ప్రకటించడంతో.. బీజేఎల్పీ సమావేశం నిర్వహించి, ముగ్గురి పేర్లను ఈ పదవికి సూచించింది. వీరిలో ప్రధానంగా  ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, స్పీకర్ రాజేంద్ర అర్లేకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లను పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు నిర్ధారించారు. ఢిల్లీలో శనివారం సమావేశం కానున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు వీటిలో ఏదో ఒకపేరును ఖరారు చేస్తుంది.

ముగ్గురిలో గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారోనన్న విషయంపై గోవా రాజధాని పనజిలో రాత్రంతా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఓ హోటల్లో సమావేశమయ్యారు. ముగ్గురిలోనూ గోవా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. దేశ రక్షణ మంత్రిగా గోవా సీఎం పారిక్కర్ వెళ్లడం గర్వకారణమని వారు భావిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో మాత్రం ఆయన లేని లోటు ఉంటుందని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో బీజేపీ రథసారథిగా ఉండి విజయకేతనం ఎగరేసిన పారిక్కర్.. తాను రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు చేరువగా వెళ్తున్న విషయాన్ని చాలా భారంగా ప్రకటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles