After spicejet flight hits buffalo on runway nationwide airport security review

nation, spicejet flight, hits buffalo, surat airport, engine damaged, Nationwide Airport Security Review

After SpiceJet Flight Hits Buffalo On Runway, Nationwide Airport Security Review

న్యూయార్క్ లో మూషికం.. గుజరాత్ లో మహీషం.. విమానాలకు కష్టకాలం..

Posted: 11/07/2014 11:00 PM IST
After spicejet flight hits buffalo on runway nationwide airport security review

ఇటీవల న్యూయ్యార్ విమానాశ్రయంలోకి టిక్కట్ లేకుండా ప్రవేశించి.. నార్వే ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని ఐదు గంటల పాటు బుల్లి మూషికం అపిన విషయాన్ని తెలుసుకుందో ఏమో.. మన దేశంలోని ఓ మహీషం తానెం తక్కువ తిన్నన్నా అంటూ ఏకంగా రన్ వే పైకి దూసుకువచ్చింది. ఇంకొన్ని క్షణాలలో గగనతలంలోకి ఎగిరిపోవాల్సిన విమానాన్ని అపేసింది. అప్పటి వరకు హాయిగా రన్ వే పై పరుగులు పెడుతున్న విమానంలోంచి గేద వుండటాన్ని గమనించిన పైలెట్ ఒక్కసారిగా నిలిపివేశాడు. దీంతో విమానం పెద్ద కుదుపుకు గురవ్వగా, అందులోని ప్రయాణికులు ఏం జరిగిందని కంగారుపడ్డారు. విషయం తెలసుకుని ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని సూరత్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్న ఓ స్పైస్ జెట్ విమానం 140 మంది ప్రయాణికులతో బయల్దేరింది. అది ప్రయాణం మొదలుపెట్టి రెండు నిమిషాలు కూడా అయ్యిందో లేదో గానీ.. ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆగడానికి ముందు ఒక్కసారిగా ప్రయాణికులంతా చిన్నపాటి కుదుపునకు కూడా లోనయ్యారు. ఏం జరిగిందా అని చూస్తే.. రన్వే మీదకు వచ్చిన గేదె ఒకదాన్ని ఆ విమానం ఢీకొంది. అసలింతకు విమానశ్రయంలోకి మహీషం ఎలా వచ్చిందన్న అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

విమానాశ్రయం సమీపంలో పంట పోలాలు వుండటంతో వాటిలో మొలిచే పచ్చ గడ్డిని తినేందుకు గేదెలు రావడం సహజం. అయితే ఓ పక్క ప్రహరీగోడ కొంతమేర పడిపోవడంతో.. ఆ ఖాళీ లోంచి గడ్డి మేయడం కోసం ఆ గేదె వచ్చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే అది ఏకంగా రన్ వే పైకి వచ్చినా.. రన్ వే పహారాను చూడాల్సిన సిబ్బంది ఏం చేస్తున్నారన్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. మరోవైపు గేదను అఖరు నిమిషంలో గమనించి విమానాన్ని నిలిపేడం పట్ల కూడా అధికారుల విచారణ చేపడుతున్నారు. కాస్త దూరం నుంచే గేదెను గమనించి వుంటే.. విమానానికి కూడా నష్టం జరిగేది కాదని అధికారులు భావిస్తున్నారు.

Flight-Hits-Buffalo

ఈ ఘటనలో పైలెట్ గేదను ఢీకొనడంతో స్పైస్ జెట్ కు చెందిన బోయింగ్ 737 విమానం ఇంజన్ బాగా పాడైపోయింది, అటు గేదె కూడా చనిపోయింది. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పౌర విమానయాన మంత్రిత్వశాఖ మొత్తం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రత గురించి సమీక్షించాలని ఆదేశించింది.య కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజు అధికారులతో రెండు గంటల పాటు సమీక్షించి.. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రాయాల భద్రతపై అధికారులతో సమీక్షించారు. ముఖద్వారం కాకుండా మరో మార్గాలు, శిధిలమైన ప్రహరీలను తక్షణం పునరుద్దరించాలని ఆదేశించారు.

 పైలట్ కూడా ఉన్నట్టుండి ఆ గేదెను చూడటంతో విమానం ఆపేలోపే దాన్ని ఢీకొట్టారు. కొన్ని సెకండ్లు ఆగి ఉంటే విమానం గాల్లోకి ఎగిరిపోయేదని, కానీ ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఓ ప్రయాణికుడు చెప్పారు. పైలట్ అప్రమత్తంగా వుండి వుంటే విమానాన్ని కొన్ని క్షణాల ముందుగానే టేకాఫ్ చేసి.. గేదెను తప్పించి, ప్రయాణికులతో సురక్షితంగా ప్రయాణం సాగేదని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే రాత్రి సమయంలో రన్ వై పైనున్న గేదను గయనించడంతోనే పైలట్ నిలిపేశారని, పైలట్ అప్రమత్తపై అనుమానాలు అవసరం లేదని స్సైస్ జెట్ విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles