This may be the oldest surviving photo of a human

Louis Daguerre, remarkable, Paris, France, 1838, earliest photograph, featuring a person, .a man getting his boots clean, sidewalk, boot-cleaner, oldest, surviving photo, human, Retronaut, Mashable

This may be the oldest surviving photo of a human

మనవాళ్లు తీసిన తొలినాళ్ల ఫోటోలు..చూశారా..?

Posted: 11/08/2014 11:09 PM IST
This may be the oldest surviving photo of a human

ప్రపంచంలో ఛాయాచిత్రాలు తీసే కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్ల ఫోటోలను మీరు ఎప్పుడనా చూశారా..? తాజాగా ప్రపంచంలోనే ఫస్ట్‌ సెల్ఫీగా పేరొందిన చిత్రాన్ని ఏకంగా 70వేల పౌండ్లకు యూకేలో జరిగిన వేలంలో విక్రయించారు. అంతటి డిమాండ్ వున్న ఫోటోలను మీరెప్పడైనా చూశారా.  19వ శతాబ్ధానికి చెందిన ప్రఖ్యాత స్వీడిష్‌ ఫోటోగ్రాఫర్‌ ఆస్కార్‌ రెజిలాండర్‌ 1850వ సంవత్సరంలో తీశారు. 150 ఏళ్ల క్రితం ముందే తీసి, లెదర్‌ బైండింగ్‌ ఆల్బమ్‌లో ఉంచిన చిత్రాలు ఎంతో ప్రాధాన్యాన్ని పొందాయి.

అయితే అంతకన్నా పురాతనమైన చిత్రాలను మీరు చూశారా..? ఎక్కడో నెట్ లో చూసే వుంటారు, కానీ అవి అంత పురాతన చిత్రాలని తెలియక గమనించివుండరు. సరిగ్గా అలాంటిదే అందరీకీ ఎదురవుతోంది. ఇదిగో ఈ చిత్రాన్ని చూడండి. అంతగా గుర్తుపట్టలేనంతగా వున్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో వున్న ఇది పారిస్ నగరంలోని ఓ వీధి చిత్రం. దీనిని లూయిస్ డాగుర్రీ 1838లో తీసారట. ఈ ఫోటోనే ఇప్పటి వరకు మనిషి తీసిని అతి పురాతన ఫోటోగా చెప్పుకుంటున్నారు.

దాని కుడిపక్కన కింద మరో చిత్రం వుంది చూడండీ ఇది కూడా పురాతన చిత్రమే. ఇందులో మనకేమీ కనబడటం లేదు. చూచాయగా మనకు అర్థమవుతోంది మాత్రం ఎవరో ఒక పెద్దాయన తన షూస్ కు రంగు వేయించుకుంటున్నట్లు కనబడుతోంది. పక్కనే షూస్ కి రంగువేసే వాడూ వున్నాడు. ఈ రెండుచిత్రాలను తీసింది లూయిస్ డాగుర్రీయేనట. తొలినాళ్లలో వెండి పలకం పై ఈ ఫోటోలను తీశారట. ఈ చిత్రాలు చాఃనాళ్లుగానే నెట్ లో దర్శనమిస్తున్నా.. ఎవ్వరూ పట్టించుకోలేదట. ఈ చిత్రాల విశిష్టత తెలిసిన తరువాత ఒక్కక్కురుగా అందరూ వీటికి అకర్షితులవుతున్నారు.

మాషెబుల్ అనే న్యూస్ పోర్టల్ వీటి విశిష్టతను తెలుపుతూ పురాతణ చిత్రాలను నెట్ జనులకు పరిచయం చేసే రెట్రోనౌట్ వెబ్ సట్ తో కలసి పేజి వ్యాసం రాయడంతో.. వాటిని దచివిన తరువాత అందరూ ఈ ఫోటోలను వీక్షించడానికి ఆసక్తి చూపుతున్నారట. ఇక మరికొందరైతే వాటిని తమ మెయిల్ లలో భద్రపర్చుకుంటున్నారు. రెట్రోనౌట్ ప్రకారం ఈ చిత్రాలు అప్పట్లో ఎక్సఫోజర్ కావడానికి సుమారు ఏడు నిమిషాల సమయం పట్టేదట. అయితే కింది చిత్రంతో ఓ సంపన్నుడు, షూలకు రంగు వేసే వాడుతో పాటు.. ఆ రోడ్డుపై వెళ్తు న్న గుర్రపు జట్కాలు, నడుస్తున్న వ్యక్తులు కూడా వున్నారు. అయితే వారందరూ ఫోటోలో వున్నప్పటికీ.. ఏడు నిమిషాల పాటు కదలకుండా లేకపోవడంతో ఫోటోలో రాలేదని రెట్రోనౌట్ సంస్థ తెలిపింది.

ప్రస్తుతం సాంకేతిక విప్లవం అందించిన ఫలాల మూలంగా ప్రతీ ఒక్కరి జేబులో ఒక స్మార్ట్ ఫోన్ వుండటం కలసివచ్చింది. ప్రతి రోజు 350 మిలియన్ల ఫోటోలు ఫేస్ బుక్ తదితర సైట్లలో అప్ లోడ్ అవుతున్నాయి. అయినా పురాతన చిత్రాల పట్ల మక్కువ మాత్రం తగ్గనే లేదు. 19వ శతాబ్ధానికి చెందిన ప్రఖ్యాత స్వీడిష్‌ ఫోటోగ్రాఫర్‌ ఆస్కార్‌ రెజిలాండర్‌ 1850వ సంవత్సరంలో తీశారు. 150 ఏళ్ల క్రితం ముందే తీసి, లెదర్‌ బైండింగ్‌ ఆల్బమ్‌లో ఉంచిన చిత్రాలను ఓ పురాతన చిత్రాల ఆల్బమ్‌ను విక్రేత కార్యాలయానికి తీసుకువచ్చి, దాన్ని వంద పౌండ్లకు విక్రయిస్తానని ప్రకటించాడు. తర్వాత పురాతన ఫోటోల అరుదైన అల్బమ్‌కు ఆదరణ పెరగటంతో విక్రేత దాని అసలు ధరను త్వరగానే గ్రహించాడు. ఇంతలో ఈ ఆల్బమ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఆకర్షితులయ్యారు. ఈ సంఘటనే పురాతన చిత్రాలకు అదరణ తగ్గలేదని రుజువు చేస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles