Suresh raina naman ojha staged a comeback into the test fold

Mahendra Singh Dhoni, test series, Karn Sharma, Lokesh Rahul, team india test team, Suresh Raina, Naman Ojha, bcci, Virat Kohli, India vs Australia

suresh raina naman ojha staged a comeback into the test-fold, dhoni to miss first test against australia

టెస్టుల్లొకి రైనా, ఓజా, మొదటి టెస్టుకు ధోని దూరం..

Posted: 11/10/2014 06:31 PM IST
Suresh raina naman ojha staged a comeback into the test fold

ఆస్ట్రేలియా సిరీస్ కు 21 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇవాళ ప్రకటించింది. ఊహించినట్టుగానే కర్ణాటక ఓపెనర్ లోకేష్ రాహుల్, లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మలను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. వికెట్ కీపర్- బ్యాట్స్మన్ నమన్ ఓజా, సురేష్ రైనాలకు టీమ్ లో మళ్లీ చోటు కల్పించారు. రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్పలను తీసుకున్నారు. గాయపడిన ఇషాంత్ శర్మ స్థానంలో వినయ్ కుమార్ కు అవకాశమిచ్చారు.

ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటి టెస్టుకు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కానున్నాడు. ముంజేతి గాయం కారణంగా అతడు తర్వాతి మ్యాచ్ లకు ఆడడం కూడా అనుమానంగా మారింది. ధోని పూర్తిగా కోలుకోలేదని ఫిజియో కోచ్ నిర్ధారించడంతో అతడు ఆడకపోవచ్చని తెలుస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డేల సిరీస్ లో మొదటి మూడు వన్డేలకు ధోని విశ్రాంతి కోరడంతో అతడి స్థానంలో విరాట్ కోహ్లి జట్టుకు నాయకత్వం వహించాడు. దీంతో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరగనున్నమొదటి టెస్టులో భారత జట్టుకు కూడా విరాట్ కోహ్లీయే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. డిసెంబర్ 4 నుంచి భారత్, ఆస్టేలియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

తుది జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, విజయ్ కుమర్, కేఎల్ రాహుల్, ఛత్తీశ్వర్ పుజర, రహానే, సురేష్ రైనా, నామన్ ఓజా, వృద్దీమాన్ సాహా, అశ్విన్ జెడేజా, భువనేశ్వర్ ప్రసాద్, షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, ఆరోన్, కర్న్ శర్మలను చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. పాకిస్థాన్ చేతిలో ఓటమిని చవిచూసి పూర్తిగా చతికల అస్ట్రేలియాపై నాలుగు టెస్ట్ ల సీరిస్ భారత్ సొంతం చేసుకోవాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles