Husband complaints to collecter on forcible prostitution of his wife

Prostitution, Wife, Prajavani, Husband, Collector, West godavari, manhandling, forcible, inquiry

husband complaints to collecter on forcible prostitution of his wife

నా భార్యతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు..

Posted: 11/11/2014 09:03 AM IST
Husband complaints to collecter on forcible prostitution of his wife

తన భార్యతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఓ భర్త ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. తన భార్యను రక్షించాలని బాధితుడు ప్రాదేయపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో అందమైన మహిళలను వ్యభిచార ముఠాలు ఎలా తమ కబంధ హస్తాలలోకి తీసుకుని బలవంతంగా వ్యభిచార రోంపిలోకి దింపుతారో ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. వివాహితని కూడా చూడకుండా బలవంతంగా వ్యభిచార రోంపిలోకి దింపి సోమ్ము చేసుకుంటున్న ఘటనపై తాను తిరుగుబాటు చేయలేని ఓ భర్త చివరాఖరికి తన భార్యను రక్షించాలని జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారంటేనే దారుణాలు ఏంత వికృతంగా సాగుతున్నాయో అర్థమవుతోంది.

ఏలూరు మండలం గవరపేట 50వ డివిజన్‌లో నివాసం ఉండే చొచ్చుపల్లి శ్రీనివాస్ భార్యను.. తంగెళ్లమూడి ఎమ్మార్సీ కాలనీకి చెందిన మణి అనే వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు తీసుకువెళ్లిపోయిందని, దీంతో తన భార్యను పంపించాలని కోరితే ఖర్చులకు డబ్బులిస్తామంటూ బదులు చెబుతున్నారని భర్త వాపోయాడు. బలవంతంగా తన భార్యను నిర్భందించి వ్యభిచారం చేయించడమే కాక భార్యను పంపాలని అడిగితే చంపుతానని, కొడతానని బెదిరిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చే శాడు.

తనకు ఆరోగ్యం బాగోలేదని, పిల్లలు రాఘవస్వామి (8), మల్లేశ్వరస్వామి (7) అనాథలుగా రోడ్లపై తిరుగుతున్నారని, తమ కుటుంబాన్ని రక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఏలూరులో యథేఛ్ఛగా జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టాలని, తన భార్య లాంటి ఎంతో మంది వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారని బాధితుడు తెలిపాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ కె.భాస్కర్ కేసును దర్యాప్తు చేయాలని డీఎస్పీ కేజీవీ సరితను ఆదేశించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prostitution  Wife  Prajavani  Husband  Collector  West godavari  manhandling  forcible  inquiry  

Other Articles