Prime minister modi on 10 days ap chief minister chandra babu and team on 4 days foreign tour

prime minister, Narendra modi, foreign tour, Myanmar, Australia, AP Chief minister, Chandra babu, ministers, singapore, Foreign tour, Narayana, yanamala Ramakrishnudu

prime minister modi on 10 days, AP Chief minister chandra babu and team on 4 days foreign tour

10 రోజలు పాటు ప్రధాని, 4 రోజుల పాటు చంద్రబాబు ఫారిన్ టూర్..

Posted: 11/11/2014 09:14 AM IST
Prime minister modi on 10 days ap chief minister chandra babu and team on 4 days foreign tour

దేశ ప్రధాని నరేంద్ర మోడీ 10 రోజుల పాటు తూర్ప దేశాల పర్యటనకు వెళ్తుండగా, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన బృందంతో కలసి నాలుగు రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. తూర్పు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటన చేపట్టనున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీల్లో సాగే ఈ పర్యటనలో ఆయన కీలక ప్రపంచ సదస్సుల్లో పాల్గొంటారు. బ్రిస్సేన్‌లో జరిగే జీ-20 సదస్సులో.. నల్లధనంపై పోరులో అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావిస్తానని మోదీ పర్యటన సందర్భంగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీ-20, ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్ తదితర ఖండాల దేశాలకు చెందిన 40 మంది నేతలను కలుసుకుంటారు.

అటు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారిగా ఇవాళ మధ్యాహ్నం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కలిపి మొత్తం 13 మంది ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్తారు. ఈ నెల 14వ తేదీ వరకు బాబు బృందం సింగపూర్‌లోనే పర్యటించనుంది. ప్రధానంగా కొత్త  రాజధానిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలు, కొత్తగా పోర్టుల నిర్మాణం వంటివి అంశాలను అధ్యయనం చేయనున్నారు. సింగపూర్‌కు చెందిన కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో పెట్టబడులు పెట్టాల్సిందిగా ఈ పర్యటనలో సీఎం ఆహ్వానించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

సింగపూర్ పర్యటనకు చంద్రబాబుతోపాటు అధికారికంగా వెళ్తున్న వారి పేర్ల జాబితా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ కమ్యునికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఐటీ సలహాదారు జె. సత్యనారాయణ, ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ ముఖ్యకార్యదర్శి డి. సాంబశివరావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం వ్యక్తిగత సహాయకుడు బి.రాజగోపాల్, సీఎం ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్ నగేశ్‌బాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles