Women dead 50 hospitalized after sterilization surgery in chhattisgarh

Chhattisgarh, health minister, Amar Agarwal, CM Raman singh, 3 member commitee, negligence, government-run health camps, eight women, sterilization surgeries, Takhatpur, Bilaspur.

women dead, 50 hospitalized after sterilization surgery in Chhattisgarh

ఛత్తీస్ గడ్ లో వైద్యుల నిర్లక్ష్యం, 8 మంది మృతి

Posted: 11/11/2014 12:59 PM IST
Women dead 50 hospitalized after sterilization surgery in chhattisgarh

ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్షానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ ఘటన నిలుస్తోంది. వైద్యుల నిర్లక్షానికి ఎనమిది మంది మహిళలు తమ ప్రాణాలను కోల్పోగా. మరో 80 మందికి పైగా మహిళలు పరిస్థితి ఆందోళన కరంగా వుంది. వివరాల్లోకి వెళ్తే.. బిలాస్ పూర్ జిల్లా తాక్తాపూర్ లో శనివారం ప్రభుత్వ వైద్యులు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సుమారు 80 మంది మహిళలు ఈ శస్త్రచికిత్సలను చేయించుకున్నారు. అయితే వీరంతా రెండు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో భాధపడుతున్నారు.

శస్త్ర చికిత్స చేయించుకున్న మరుసటి రోజునే జానకీ బాయ్ అనే మహిళ సృహ కోల్పొయిందని, తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆమెను బిలాస్ పూర్ జిల్లా అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమె మరణించింది. జానకీ బాయ్ తో పాటు శనివారం రోజున కుటుంబ నియంత్రణ అపరేషన్ చేయించుకున్న వారందరూ కూడా ఒక్కరుగా అస్పత్రిలో చేరారు. వారిలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలను కొల్పయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అస్పత్రిలో చికిత్స పోందుతున్న 52 మందిలో మరో 30 మంది పరిస్థితి విషమంగా వుందని వైద్యాధికారులు తెలిపారు. ఆందోళనకరంగా వున్న 7గురు మహిళలను బిలాస్ పూర్ లోని సిమ్స్, అపోలో ఆస్పత్రులకు తరలించామని అస్పత్రి ఉన్నతాధికారులు తెలిపారు.

ఛత్తీస్ గడ్ వైద్యశాఖ మంత్రి అమర్ అగర్వాల్ సోంత జిల్లాలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర వైద్యశాఖ అధ్వర్యంలో జరిగిన ఈ శస్త్ర చికిత్సలపై ఆ విభాగం విచారణకు ఆదేశించింది. ఘటనపై స్పందించిన ప్రభత్వం తిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు పరిస్థితి విషమంగా వున్నవారికి యాభై వేలు రూపాయలను ప్రకటిచింది. భాధిత కుటుంబాలకు సీఎం రమణ్ సింగ్ పరామర్శించనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles