Badradri region people demanding them to join in andhrapradesh

Badradri region, Badrachalam, people, demand, join in, andhrapradesh, AP CM chandrababu, Telangana, kothagudem, Telangana CM KCR

Badradri region people demanding them to join in andhrapradesh

ఆంధ్రలో కలపాలంటూ భద్రాదిలో కొత్త ఉద్యమానికి బీజాలు..

Posted: 11/11/2014 12:08 PM IST
Badradri region people demanding them to join in andhrapradesh

భద్రాద్రి వాసులలో కొత్త ఆందోళన తలెత్తుతోంది. భద్రాచలం డివిజన్ లోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడంతో.. ఒంటరిగా మిగిలిన భద్రచలంను తెలంగాణ ప్రభుత్వం అంత ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని అందుచేత తమను ఆంద్రలో కలిపాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఖమ్మం జిల్లాలో తమ ప్రాబల్యాన్ని రమారమి పూర్తిగా కోల్పోయిన టీడీపీ నేతలు ఈ డిమాండ్ తో ముందుకు వెళ్లాలని కొందరు నేతలు ప్రయత్నాలు ఆరంభించారు. దీంతో జిల్లాలో తమకు పూర్వ వైభవం వస్తుందని కూడా వారు భావిస్తున్నట్లు సమాచారం.

భద్రాచలం ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి చంధ్రశేఖర్ రావు తుమ్మలా నాగేశ్వర రావు పార్టీలో చేరిన సందర్భంగా హామి ఇచ్చారు. ఆ తరువాత కొత్తగూడెం ను జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించడంతో భద్రాచలం వాసులకు నిరాశ కలిగింది. అయితే భద్రచలం బదులు కొత్తగూడెంను జిల్లా కేంద్రం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించడమే ఈ డిమాండ్ తెరపైకి రావడానికి కారణమయ్యింది. భద్రాచలం నియోజకవర్గంలోని వివిధ మండలాలు ఆంద్రలో కలవడంతో అక్కడి ప్రజలు తమ పనుల కోసం రంపచోడవరం లేదా రాజమండ్రి వెళుతున్నారట. దీతో భధ్రాచలంలో వ్యాపారాలు కూడా గతంలో నడిచినట్టుగా ప్రస్తుతం లేవట. ఈ కారణాలతో కొత్త ఉద్యమాన్ని ప్లాన్ చేయాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో భద్రాచలం టిడిపి నేతలు చంద్రబాబు ను కలిసి భద్రాచలంను జిల్లా కేంద్రంగా చేయడానికి తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని,లేదంటే భద్రాచలం ను కూడా ఆంద్రలో కలిపి జిల్లా గా ప్రకటించాలని కోరారు.అంతేకాక కొందరు తెలంగాణలో ఉంటే బెటరా,లేక ఆంద్రలోకి వెళితే బెటరా అని కరపత్రాలు పంపిణీ చేసి, అంతిమంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆంద్రలో కలవడమే బెటర్ అని తేల్చారట.ఒకప్పుడు ఇక్కడ తెలంగాణలోనే ఉండాలంటూ ఆందోళన జరిగింది.కాని మారిన పరిస్థితి ఇలా ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles