Aligarh muslim university ban on female students entry into library

Aligarh Muslim University, AMU, Education in India, Gender discrimination, India, misogyny, sexism, Sexual violence, ban, female students, Library

Aligarh Muslim University ban on female students entry into Library

ఆ విశ్వవిద్యాలయంలో మహిళలకు ప్రవేశం లేదు..

Posted: 11/11/2014 03:53 PM IST
Aligarh muslim university ban on female students entry into library

ప్రతిష్టాత్మక అలిగఢ్ ముస్లిం యూనివర్సిటీలో లింగ వివక్ష రాజ్యమేలుతోంది. ఉన్నత చదువులకు ఆలవాలమైన సరస్వతీ దేవి కొలువలైన స్థలంలో.. విద్యా సరస్వతులపై పలు అంక్షలు కొనసాగుతున్నాయి. ఏకంగా విశ్వవిద్యాలయాల్లోనే మహిళలు ఇలాంటి ఆంక్షలను ఏదుర్కోనడంపై సభ్యసమాజం ప్రశ్నించాల్సిన అవసరముంది. చదువుకుంటే ఉన్న మతి పోతుందని పెద్దలు వెటకారంగా అన్న మాటలు ఇక్కడ అక్షర సత్యాలవుతున్నాయి. యూనివర్సిటీలో విద్యార్థినులకు మౌలానా ఆజాద్ లైబ్రరీలోకి వెళ్లే అవకాశం లేకుండా ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. వారిని లైబ్రరీలోకి రానీయకుండా బషిహ్కరణ కోనసాగుతోంది. మహిళా విద్యార్థులను అలిగఢ్ విశ్వవిద్యాలయ అధికారులు సిగరెట్లు, మద్యం సీసాలతో సరిపోలుస్తున్నారు.

అలిగఢ్ ముస్లిం విశ్వవిధ్యాలయంలో మహిళా విద్యార్థులను సాటి మనుషులుగా కాకుండా వస్తువులుగా ఉన్నతాధికారులు పరిగణిస్తున్నారు. అక్కడి గంధ్రాలయంలోకి మహిళా విద్యార్థులను వెళ్లనిస్తే వారు పురుష విద్యార్థులను ఆకర్షిస్తారని యూనివర్సిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుచేత వారికి అనుమతిని నిరాకారించినట్లు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మహిళల ఆకర్షణలో పడితే విద్యార్థుల విద్యకు భంగం వాటిల్లుతుందని అధికారులే తిరిగి ప్రశ్నిస్తున్నారు. మహిళా విద్యార్థులు మౌలానా ఆజాద్ గ్రంధాలయంలోకి వెళ్లాలని చేసిన ప్రయత్నాలను స్వయంగా అ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ అడ్డకుని, పురుష విద్యార్థుల చదువులకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారంటే పరిస్థతి తీవ్రత అర్థమవుతోంది.

స్వత్రంత భారతదేశంలో కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా మహిళా విద్యార్థులకు విద్యా అవకాశాలను ప్రభుత్వాలు కల్పిస్తుంటే.. ఈ విశ్వవిద్యాలయంలో మాత్రం మహిళలకు చదవులెందుకు అన్న విధంగా యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ లెఫ్టెనెంట్ జనరల్ జమీర్ ఉద్దిన్ షా వ్యవహరిస్తున్నారు. ఆయనకు జతగా కలిశారు మహిళా కళాశాల ప్రిన్సిఫల్ నయామా గుల్జర్.. లైబ్రరీలోనికి మహిళా విద్యార్థులందరినీ పంపిస్తే.. యూనివర్సిటీ ఆవరణలో క్రమశిక్షణ ఉల్లంఘన చోటుచేసుకుంటుందని ఆమె వ్యాఖ్యానించారు. గ్రంధాలయంలో వున్న 1300 సీటింగ్ కెపాసిటీలో కేవలం 12 సీట్లు మాత్రమే మహిళా విద్యార్థినులకు రిజ్వర్ చేసి వున్నాయని అమె చెప్పారు. అందుకోసం మహిళా విద్యార్థులందరినీ  అందులోనికి అనుమతించకుండా ఆంక్షలు విధించినట్లు చెప్పారు.

ఈ విషయమై స్పందించిన జమీర్ ఉద్దీన్.. మహిళా విద్యార్థునులను కూడా గంధ్రాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న అవసరాన్ని తాము గుర్తించామన్నారు. అయితే ఇప్పటికే విద్యార్థులతో కిటకిటలాడుతున్న గంధ్రాలయంలోకి విద్యార్థినులను కూడా పంపితే.. క్రమశిక్షణాపరమైన పిర్యాధులు వెల్లువెత్తే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. తాము ఈ విశ్వవిద్యాలయ విద్యార్థిపేలమేనని.. తమకు గ్రంధాలయంలోకి వెళ్లే అవకాశాన్ని కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. లైబ్రరీలో చోటు లేదన్నదే కారణమైతే.. తమకు కేవలం పుస్తకాలను జారీ చేయాలని, వాటిని పరిశీలించిన తరువాత వాటిని తామే తిరిగిస్తామని చెబుతున్నా అధికారులు తమ వినతిని పట్టించుకోవడం లేదని విశ్వవిద్యాలయం మహిళా విద్యార్థినుల యూనియన్ గుల్పిజా ఖాన్ అన్నారు.

వివక్ష రహిత సమాజంలో స్త్రీ, పురుషులిద్దరూ సమానేమంటూ, ఆకాశంలో సగమంటూ నినదిస్తున్నా.. విద్యా నిలయాలలోనే ఇంకా అనాచారం, అనాగరికం రాజ్యమేలుతోందని మహిళా సంఘాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles