Man proposes to girlfriend using 99 iphones she says no

China, celebrates, Singles Day, November. 11, woo a special someone in their life, Guangzhou, expensive

Guangzhou man buys 99 iPhone 6s to confess his love to colleague before Singles' Day, She Says No

బ్రోకెన్ హార్ట్: 99 ఐఫోన్లుతోనూ అమె హృదయం రింగ్ కాలేదు..

Posted: 11/11/2014 05:06 PM IST
Man proposes to girlfriend using 99 iphones she says no

వాలెంటైన్స్ డే ప్రేమికుల రోజు.. నచ్చిన నెచ్చెలికి తమ ప్రేమను వ్యక్త పరచడానికి మంచి అవకాశంగా భావిస్తారు ప్రేమికులు. తను మెచ్చిన అబ్బాయికి మనస్సులోని మాటాను చెప్పేందుకు కలసివచ్చిన అవకాశంగా భావిస్తారు అమ్మాయిలు. ప్రేమను వ్యక్త పర్చడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒకరు పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తే.. మరొకరు బహుమతి ఇచ్చి, మరొకరు గ్రీటింగ్‌కార్డు ఇచ్చి.. తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. తన మనస్సున నచ్చిన వ్యక్తి, తాను మెచ్చిన వ్యక్తి కోసం ఎంత చేసినా, ఎలా చేసినా.. డోంట్ కేర్ అంటుంటారు ప్రేమికులు. దీని బట్టి మీకు మంచి రోమాంటిక్ కధ చెబుతున్నానని అనిపిస్తుంటుంది కదూ.. కానీ కాదు. ఇది ప్రేమ కథకు పూర్తి భిన్నమైన కథ.. అదేనండి.. బ్రోకెన్ హార్ట్ అంటారే. రమారమి అలాంటిదే..

చైనాలో నవంబర్ 11ను సింగిల్స్ డే గా జరుపుకుంటారు. నెలలో రెండు ఒక్కట్లు, తేదీలో రెండు ఒక్కట్లు.. (11-11) ఇద్దరిని ఒకటి చేయడానికి దోహదపడతాయని శుభదినంగా పరిగణిస్తుంటారు చైనా వాసులు. ఇలానే తాన మెచ్చిన సహచర ఉద్యోగిని వరించిన ఓ చైనాలోని గ్వాంగ్జుకి చెందిన అబ్బాయి అదే ఆపీసులో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. తన ప్రేయసికి వినూత్న పద్ధతిలో ప్రేమను వ్యక్త పరిచాలనుకున్నాడు. కార్యాలయ అవరణలో తన సహచరులు, ఆఫీసు సిబ్బంది మధ్యకు తన ప్రేయసిని పిలిచాడు. అప్పటికే ఏకంగా 99 ఐఫోన్ 6ఎస్ ఫోన్లను కానుకగా ఇస్తూ.. వాటిని హృదయాకారంలో అమర్చి దాని మధ్యలో ఆమెకు ప్రపోజ్ చేశాడు. 99 ఐఫోన్లు చూసినా అమె హృదయం స్పందించలేదు. అతని ప్రేమను అమె నిరాకరించింది. అతడు ప్రపోజ్ చేయగానే అమె నో అని చెప్పింది.

దీంతో మనోడి హృదయం బద్దలైంది. దానికి తోడు బ్యాంకులోని డబ్బుకు కూడా పెద్ద బోక్కపడింది. సుమారు 60 లక్షల రూపాయలతో 99 ఐఫోన్ లను అతను కొన్నాడట. తన ప్రేమను వ్యక్తం చేయడానికి అతనిక అయిన ఖర్చు సుమారు 60 లక్షలు ఇది అతని రెండేళ్ల జీతం డబ్బుతో సమానమట. ఇంత చేసినా అతనికి ప్రేమ దక్కలేదు. అయితే ఇప్పుడు అతను ఈ ఫోన్లను అమ్మాలా, కొన్న షాపులోనే తిరిగి ఇచ్చేయాలా..? వద్దా అని డైలిమాలో వున్నాడట. నీ ప్రేమ బంగారం కాను.. అని అన్నట్లు సింగిల్స్ డే రోజున తన నచ్చిన వారి మనస్సు దోచుకునేందుకు పెద్ద భవంతులు, కార్లు, డైమండ్స్ లాంటివి కూడా కోని బహుమానంగా ఇస్తారని, ఇందులో విచిత్రమేమీ లేదని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియా సంచలనం సృష్టిస్తున్నాయి. అక్కడి సోషల్ మీడియా వెబ్‌సైట్ 'వైబో'లో పెట్టిన ఈ ఫొటోలను యువత విపరీతంగా షేర్ చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles