The internet to take their cutting chai to the masses

internet, online shopping, ChotuChaiwala.com, mumabi, Mumbai Chaiwalas, Cutting Chai, Masses, initiative, celebrates, sip of garam chai.

The Internet To Take Their Cutting Chai To The Masses

ఆన్ లైన్ లో ఛాయ్ వాలా హల్ చల్.. కోరిన వెంటనే దరిచేరుతుంది..

Posted: 11/15/2014 12:00 AM IST
The internet to take their cutting chai to the masses

అంతర్జాలం అదేనండి మన ఇంటర్నెట్ ఎంత పనైనా చేస్తోంది. ఎవరికైనా స్నహితుడిగా మారుతోంది. అయితే మనం విజ్ఞత కోల్పోనంత వరకు అది మనకు వరం.. కాదని మీరితేనే శాపం. వరాలు, శాపాలు అన్న అంశాన్ని పక్కన బెడితే.. ఇంటర్ నెట్ సాయంతో ఆన్ లన్ లో మనం ఎన్ని కొనుగోలు చేస్తున్నామో, ఎంతకు చేస్తున్నామో కూడా మీకు తెలుసు. మంచి ఆఫర్లతో ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే వారుండాలే కాని, ఏది మాత్రం కొనం అనేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. షాపింగ్ కోసం పెద్దననగా వెళ్లి.. ఏ సాయంత్రానికో ఇంటికి చేరుకోవడం కన్నా, ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ పాట్లు పడటం కన్నా ఆన్ లైన్ లో ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేయడమంటే ఏవరి మాత్రం ఇష్టముండదు.

సరిగ్గా అలానే సరదాగా చాయ్ తాగాలంటూ కూడా ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా.. ఎంచక్కా మన పని మనం చేసుకుంటూ చోటూ ఏక్ చాయ్ అనగానే ఇంటికి ఛాయ్ తీసుకోచ్చి ఇచ్చేవారుంటే ఎంత బాగుంటుంది కదూ..  మరీ మీ అసాధ్యం సంతకెళ్లా.. గుటికెడు ఛాయ్ కోసం ఆన్ లైన్ లో పెట్టి అమ్ముతారా.. బుక్ చేయగానే ఇంటికి తీసుకువచ్చి ఇస్తారాయే అనే పెద్దలు ఇక ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఛాయ్ కూడా ఇంటర్ నెట్ ద్వార పొందగలుగుతున్నాం. నిజమండీ ఇప్పుడిప్పుడే ముంబైలో ఛాయ్ వాలాల కోసం చోటు చాయ్ వాలా డాట్ కామ్ అనే వెబ్ సైట్ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతానికి దిగ్విజయంగా నడుస్తున్న ఈ  వైబ్ సట్..త్వరలోనే పూర్తి ముంబై వాసులకు అందుబాటులోకి రానుంది.

బట్టల నుంచి పాదరక్షల వరకు, టీవీల నుంచి మొబైల్ ఫోన్ వరకు, పిల్లల ఉత్సత్తుల నుంచి ఔషదాల వరకు, ఒక్కటేమిటీ, అన్నీనూ, ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులోకి తీసుకువస్తున్న అంతర్జాలం.. ఇప్పడు చాయ్ వాలాలను కూడా ఇంటికి రప్పిస్తుంది. వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కొందరు ఆయా ప్రాదేశాల్లోని చాయ్ వాలాలు కొరిన వారి ఇళ్లకు వెళ్లి చాయ్ అందిస్తారు. ఇప్పటి వరకు ముంబై నగరంలో 1500 పైచిలకు చాయ్ వాలాలు వీరితో ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఇది మనకూ తొందరలోనే అందుబాటులోకి రావాలని కోరుకుందా.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles