Guntur farmers reject to give their agricultural lands to ap government for capital city

andhra pradesh state news, andhra pradesh capital city controversy, guntur farmers capital city controversy, ap cm chandrababu naidu, chandrababu naidu latest news, ap capital city news, ap sub committee guntur tour, guntur capital city

guntur farmers reject to give their agricultural lands to ap government for capital city

షాక్.. రాజధానికి భూములివ్వమంటూ రైతుల ఆందోళన!

Posted: 11/15/2014 08:43 PM IST
Guntur farmers reject to give their agricultural lands to ap government for capital city

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని విషయంపై ఇటీవలే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే! గుంటూరు చేరువలో వున్న గ్రామాలను 53 కి.మీ మేర కలుపుతూ రాజధాని నిర్మాణం వుంటుందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణలో భాగంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో శనివారం మంత్రివర్గ ఉపసంఘం పర్యటించింది. ఈ సందర్భంగా రైతుల నుంచి వారు అభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని పలువురు రైతులు నినాదాలు చేస్తూ సమావేశం నుంచి బయటికొచ్చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

150 రకాల పంటలు పండే తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేది లేదని రాయపూడి రైతులు తేల్చి చెప్పేశారు. కావాలంటే తాము పంటలు పండించి రాజధానికి కూరగాయలు సరఫరా చేయడానికి సిద్ధమని పేర్కొన్నవారు.. భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు మాత్రం సిద్ధంగా లేమని ప్రకటించారు. ఇందుకనుగుణంగా వాళ్లందరూ తమ వాదనను ప్రభుత్వానికి వినిపించేందుకు భూముల అప్పగింతకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో కూడా నిమగ్నమైపోయారు. అయితే ఈ సందర్భంగా కమిటీతోపాటు సభకు వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రైతులతో వాగ్వాదానికి దిగారు కానీ ఫలితం లేకపోయింది.

తమ భూములు ఇవ్వమని తిరగబడిన రైతులు.. తక్షణమే సబ్ కమిటీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. కమిటీ ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించబోమని వారన్నారు. ఈ దెబ్బతో రాజధాని నిర్మాణం మరింత జాప్యం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా రైతుల నుంచి ఘనస్వాగతాన్ని అందుకున్న కమిటీ.. శనివారం మాత్రం రైతుల నుంచి నిరసనను ఎదుర్కొంది. ఈ వ్యవహారం చూస్తుంటే.. ఇతర ప్రాంతాల రైతుల కూడా తమ భూములు ఇవ్వమంటూ తిరగబడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొని, బాబు రాజధాని నిర్మాణం ఎలా చేపడతారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles