Hyderabad metro alignment kcr government suggestions metro managing officials meeting

hyderabad metro rail, kcr government, kcr metro rail project, kcr hyderabad metro rail review, metro rail md avs reddy, l and t executive chairman nayak, hyderabad metro rail project, kcr news, kcr latest news, historical constructions in telangana

hyderabad metro alignment kcr government suggestions metro managing officials meeting

హైదరాబాద్ మెట్రోరైల్ అలైన్ మెంట్ లో భారీ మార్పులు...

Posted: 11/15/2014 09:28 PM IST
Hyderabad metro alignment kcr government suggestions metro managing officials meeting

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మెట్రోరైల్ అలైన్ మెంట్ విషయానికి సంబంధించి ఎన్నో వార్తలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని అసెంబ్లీ దగ్గర మెట్రో మార్గాన్ని మార్చాలంటూ గతంలో కేసీఆర్ పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తర్వాత ఆయన అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదని.. అసలు మెట్రోపనుల్లో తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇలాగే రకారకాలుగా మెట్రోరైలుకు సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే వుంది. ఇదిలావుండగా.. శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఈ మెట్రోరైలు సమీక్షను నిర్వహించారు. ఇందులో ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాయక్, మెట్రో రైలు ఎండీ ఏవీఎస్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మెట్రో రైల్ ట్రయల్ రన్ వాయదా పడ్డ అంశంతోపాటు అలైన్ మెంట్ కు సంబంధించి చర్చలు జరిగినట్లు సమాచారం!

ఈ సమీక్ష నేపథ్యంలో సమావేశమైన అధికారులు మెట్రో రైలు అలైన్ మెంట్ మార్పులకు కేసీఆర్ సర్కార్, ఎల్ అండ్ టీ ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో నగరంలోని అసెంబ్లీ, పాత బస్తీ, సుల్తాన్ బజార్ లలో మెట్రో రైలు మార్గాలు పూర్తిగా మారనున్నాయి. అసెంబ్లీ ముందునుంచి వెళ్లే రైలుమార్గాన్ని వెనకనుంచి తీసుకెళ్లడం... సుల్తాన్ బజార్ మీదుగా కాకుండా ఉమెన్స్ కాలేజ్ వెనుక నుంచి... మూసి, కాలాపత్తర్ మీదుగా మెట్రో లైన్ వేయాలని చేసిన ప్రభుత్వ సూచనలను ఎల్ అండ్ టీ అంగీకరించింది. అదేవిధంగా పాతబస్తీలోని చారిత్రక కట్టడాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ప్రభుత్వ సూచనకు పచ్చజెండా ఊపడంతోపాటు మెట్రోరైల్ ను 72 కి.మీ. నుంచి 200 కి.మీ. పొడిగింపునకు అంగీకారం తెలిపింది.

మెట్రోరైల్ అలైన్ మెంట్ మార్పు వల్ల అయ్యే అదనపు ఖర్చులు తాము భరించేందుకు సిద్ధమని తెలంగాన ప్రభుత్వం ప్రకటించడంతో ఎల్ అండ్ టీ మార్పులు, చేర్పులు చేసేందుకు అంగీకరించింది. అయితే అలైన్ మెంట్ మార్పుపై ఈనెల 20న మరోసారి సమావేశం కావాలని ప్రభుత్వంతోపాటు అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. కేసులు, వివాదాలు వున్న స్థలాలను త్వరలోనే పరిష్కరించి మెట్రోకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతా బాగానే వుంది కానీ.. ఇన్ని మార్పులు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన మెట్రోపనులు ఇంకా ఆలస్యం అవుతాయి. పైగా పొడిగింపునకు కూడా అంగీకారం తెలపడంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఏదైతేనేం.. తెలంగాణాలో వున్న చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మంచిదని తెలంగాణ ప్రజలు తెలుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles