Puttanrajuvari kandriga develops model village says sachin tendulkar

sachin tendulkar, PR Kandriga, Model Village, puttanrajuvari kandriga, MP Rajyasabha, cricket, bharat ratna

వేగిర అభివృద్ధి కోసం దురలవాట్లకు దూరంకండీ..

Posted: 11/16/2014 01:04 PM IST
Puttanrajuvari kandriga develops model village says sachin tendulkar

దేశంలో ఆదర్శ గ్రామంగా పుట్టంరాజువారికండ్రీగను తీర్చిదిద్దుతానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. తన కన్న తల్లితో పాటు తాను దత్తత తీసుకున్న కండ్రిగ గ్రామానికి తన భారతరత్న అవార్డును అంకితమిస్తున్ననని సచిన్ అన్నారు. తాను మళ్లీ వచ్చే నాటికి గ్రామం అభివృద్ది చెందాలని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పీఆర్ కండ్రిగ గ్రామానికి వచ్చిన సచిన్ అక్కడ పైలాన్ ను అవిష్కరించారు. అనంరతం గ్రామస్థులతో స్వచ్ఛ భారత్ ప్రమాణం చేయించారు. గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.  గ్రామాభివృద్ది మరింత వేగిరం కావాలంటే గ్రామస్థులందరూ మద్యం, దుమపానాలతో పాటు దురలవాట్లకు దూరంగా వుండాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ప్రతీ ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ వివరించారు. మరుగుదోడ్లను సక్రమంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లల ఆరోగ్యం విషయంలో మహిళలు బాధ్యతగా మెలగాలని సూచించారు. మహిళల పట్ల పురుష సమాజం కూడా గౌరవ మర్యాదలతో మెలగాలని సచిన్ టెండుల్కర్ హితవు పలికారు. తాను దత్తత తీసుకన్న ఈ గ్రామానికి ఏ విధంగానూ చెడు పేరు రాకుండా గ్రామస్థులు సహకరించాలని కోరారు.

అంతకు ముందు ఆయన గ్రామంలోని స్థానిక చెరువులో చేప పిల్లలను వదిలి మీనోత్సవాన్ని ప్రారంభించారు. గ్రామంలో నిర్మాణ దశలో వున్న కంపోస్టు యూరియా తయారీ కేంద్రం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోకోలు శివయ్య పిల్లల చదువు ఖర్చను భరిస్తానని ఆయన హామి ఇచ్చారు. గ్రామంలోని చిన్నారులతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు. చిన్నారులకు ఆటలోని పలు మెళకువలను నేర్చించారు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.
:
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles