Thompson and morgan company developed tomtato

Tomato, potato, Thompson and Morgan Company, Britain, Holand, Green House, rare varient ,developed

thompson and morgan company developed tomtato

అరుదైన టామ్ టాటో మొక్కను చూశారా..

Posted: 11/16/2014 10:51 PM IST
Thompson and morgan company developed tomtato

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. ఒకే మొక్కకు రెండు బద్ద విరుద్దమన పంటలు కాస్తే.. భలే మంచి గిరాకీ అనుకుంటున్నారు కదూ. ఇలా ఐతే రైతులు కూడా తమ పంటలకు మంచి లాభాన్ని సాధించుకుంటారు. ఒక పంటకు కాకపోతే మరో పంటకు గిట్టుబాటు ధరలు లభించి అప్పుల ఊభిలోంచి భయటకు వస్తారు అనుకుంటున్నారు కదూ. ఇప్పుడు సరిగ్గా అలాంటి పంటే వచ్చేసింది. ఒకే మొక్కకు రెండు పంటలు కాస్తున్నాయ్.. టమాటాతో పాటు బంగాళదుంప కూడా ఒకే మొక్కకు కాస్తున్నాయి.

టమాటో+పొటాటో = టామ్‌టాటో..అంటే అటు టమాటో.. ఇటు బంగాళదుంపలు అన్నమాట. బ్రిటన్‌కు చెందిన థాంప్సన్ అండ్ మోర్గాన్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. అదీ మన ఇంట్లో పెంచుకునే టైపులో.. అలాగనీ ఇది జన్యుమార్పిడి మొక్క కానేకాదు.. ఎప్పట్నుంచో అనుసరిస్తున్న మొక్కలు అంటు కట్టే విధానంలోనే ఆధునిక పద్ధతులను వీరు అవలంభించారట. గతంలో బ్రిటన్‌లోనూ టమాటో, పొటాటోను అంటు కట్టినా.. రుచి వంటి వాటి విషయాల్లో వాటిల్లో లోటుపాట్లు ఉన్నాయట.
 
 టామ్‌టాటో విషయంలో ఆ సమస్యలేమీ లేవట. అంతేకాదు.. తొలిసారిగా వాణిజ్యపరంగా విజయవంతమయ్యేలా టామ్‌టాటోను తీర్చిదిద్దారు. అంటే.. త్వరలో దీన్ని మార్కెట్లోకి విక్రయిం చేందుకు తేనున్నారన్నమాట. ఇది 10 ఏళ్ల కృషి ఫలితమని ఈ సంస్థ డెరైక్టర్ పాల్ చెప్పారు. ‘ప్రతి టామ్‌టాటో మొక్క అంటు కట్టే ప్రక్రియను హాలండ్‌లోని ఓ ప్రయోగశాలలో పూర్తి చేస్తాం. తర్వాత అది బ్రిటన్‌కు వస్తుంది. ఇక్కడ మేం దాన్ని గ్రీన్‌హౌజ్‌లో పెంచుతాం. బాగా పెరిగిన తర్వాత విక్రయిస్తాం’ అని తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tomato  potato  Thompson and Morgan Company  Britain  Holand  Green House  rare varient  developed  

Other Articles