Mother and her daughter got delivery at same time

mother and daughter delivers same day, mother delivers along with daughter, florida mother and daughter mother heather penticoff, daughter destinee martin, usa latest news, latest telugu news updates

mother and her daughter got delivery at same time : Heather Penticoff and her daughter Destinee Martin each found out they were pregnant on the same day, and also delivers on same day

కూతురుతో కలిసి బిడ్డను కన్న ఓ తల్లి !!

Posted: 11/17/2014 11:18 AM IST
Mother and her daughter got delivery at same time

అమ్మమ్మ కావాల్సిన వయస్సులో ఓ మహిళ అమ్మ అయింది. లేటు వయసులో పురిటి నొప్పులు పడింది. అదికూడా తన కూతురు గర్బంతో ఉన్న సమయంలో.. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ సంఘటన ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాకు చెందిన హెతర్ పెన్టికాఫ్ అనే మహిళ ఆమె కూతురు డెస్టినీ మార్టిన్ ఇద్దరూ ఒకేసారి నెలతప్పారు. విచిత్రంగా వీరిద్దరికి డాక్టర్లు ఒకేరోజు డెలివరీ డేట్ ఇవ్వటం జరిగింది. ఇంకేముంది కూతురుతో కలిసి పురుటినొప్పులు పడుతూ తల్లి కూడా ఆస్పత్రిలో చేరింది.

ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఇద్దరి బిడ్డలను బయటకు తీశారు. ఇద్దరిలో ముందుగా పెన్టికాఫ్ మడాలినే అనే ఆడశిశువుకు జన్మనిచ్చింది. దాదాపు మూడు గంటల తర్వాత కూతురు డెస్టినీ డామియెన్ అనే మగబిడ్డను ప్రసవించింది. లేటు వయసులో ఒకే సారి అమ్మ కావటంతో పాటు అమ్మమ్మ అయిన ఘనత పెన్టికాఫ్ కు దక్కింది. ఇక ఈ ప్రసవాలపై మీడియాతో మాట్లాడిన అమ్మమ్మ తాజా ఘటనతో కవలల్ని కడుపులో మోయకపోయినా.., తమకు కవలలు పుట్టారు అనే ఫీలింగ్ కలుగుతోందన్నారు.

ఇక డిస్టినీ మార్టిన్ కూడా తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంది. తల్లితో కలిసి బిడ్డకు జన్మనివ్వటం చాలా సంతోషంగా ఉండటంతో పాటు ఆశ్చర్యకరమైన ఫీల్ కల్గిస్తోందన్నారు. పిల్లల్ని కనడాన్ని కాదు అనలేము. కాని ఇలా లేటు వయస్సులో తల్లులు అయితే, పుట్టే బిడ్డలు పెరిగి పెద్దయ్యే వరకు తల్లులు మంచాలకు పరిమితం అవుతారు. బిడ్డల ఆలనా పాలనా చూడాల్సిన సమయంలో వారే తల్లితండ్రులకు అన్నీ అయి ఆసరాగా నిలవాల్సి ఉంటుంది. ఇన్ని బాధలు భరిస్తూ లేటు వయస్సులో తల్లి కాకపోతే..., కూతురు బిడ్డకు అమ్మమ్మగా సంతోషంగా ఉండవచ్చు కదా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mother  daughter  latest news  florida  

Other Articles