Jeevan reddy says kcr in fears about party future

kcr on telangana, kcr latest comments, kcr comments in telangana assembly, telangana assembly latest updates, tdp leaders joins trs, congress learders joins trs, jeevan reddy comments on kcr, telangana latest news updates

jeevan reddy says kcr in fears about party future : congress mla jeevan reddy says telangana chief minister kcr fears about his party future life so that he is encouraging migrations from other parties

కేసీఆర్ కు భయం ఎక్కువట.., అందుకే

Posted: 11/17/2014 12:25 PM IST
Jeevan reddy says kcr in fears about party future

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో సాక్షాత్తు ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులు, వలసలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి అభద్రతా భావం ఎక్కువ కాబట్టే ఆయన ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మనుగడ, పటిష్టతపై కేసీఆర్ భయపడుతున్నారని.., అందువల్లే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నేతలను టీఆర్ఎస్ లోకి లాగుతున్నారని ఆరోపించారు.

అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలపై మీడియా పాయింట్ లో మాట్లాడిన జీవన్ రెడ్డి, తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించకుండా ప్రభుత్వం తమపై దాడికి దిగేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై దాడి చేసే విధంగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సర్కారు ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ద్వజమెత్తారు. అధికార పక్షం వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో అవసరమనుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

శనివారం వరకు టీడీపీ సస్పెన్షన్ పై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ.. సోమవారం రోజు పార్టీ ఫిరాయింపులపై అట్టుడికింది. ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ప్రభుత్వం చర్చ చేపట్టకపోవటంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా గతంలో కాంగ్రెస్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించిందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. సభ్యులు సభ జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాలు సహకరించకపోవటంతో మధ్యాహ్నం 12గంటల లోపు వరుసగా రెండు సార్లు సభ వాయిదా పడింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  jeevan reddy  trs  congress  telangana  

Other Articles