Narendra modi inspiring speech at sydney olympic staduim

narendra modi sydney speech, modi sydney speech highlights, narendra modi sydney latest photos, narendra modi sydney tour highlights photos, narendra modi on indians in australia, modi speech in g20 summit, modi comments on black money and terrorism, latest news updates

narendra modi inspiring speech at sydney olympic staduim : narendra modi made all indians in sydney olympic stadium and also in australia indians by his speech. modi express modi food all with modi feaver came to sydney by narendra modi speech at sydney

సేవకుడి ప్రసంగానికి సిడ్నీ దాసోహం : హైలైట్స్

Posted: 11/17/2014 05:22 PM IST
Narendra modi inspiring speech at sydney olympic staduim

మోడి మ్యానియాతో సిడ్నీ నగరం ఊగిపోయింది. ఉత్తేజభరితమైన ప్రసంగానికి భారతీయులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అలల మాదిరిగా చైతన్యవంతులయ్యారు. ప్రధాని అమెరికా ప్రసంగానికి ఏ స్పందన వచ్చిందో.., అదే స్పందన సిడ్నీలో మరోసారి పునరావృతం అయింది. నరేంద్రుడి మాటలు వినేందుకు ఆస్ర్టేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయులు సిడ్నీకి చేరుకున్నారు. మోడి ఎక్స్ ప్రస్ పేరుతో ప్రత్యేక రైలులో ఒలంపిక్ స్టేడియంకు బాటపట్టారు. ఆస్ర్టేలియా చరిత్రలోనే ఒక విదేశీ ప్రధాని కోసం ఇలా పండగ వాతావరణం నెలకొనటం తొలసారి కావటం విశేషం. ఇక విశేష స్వాగతం.. అశేష జనవాహిని మద్య ప్రవాసీయులను ఉద్దేశ్యించి ప్రధాని చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలోనూ భారతీయతను రగిలించింది. భారతీయుడుగా పుట్టాము.., కాని భారతమాత కోసం చనిపోయే అవకాశం మనకు లేదు. కనీసం తల్లి కోసం జీవించి మన రుణం తీర్చుకుందామన్న మోడి మాటకు ఒక్కసారిగా శరీరంలోని రోమాలు నిక్కబొడుచుకుని బయటకు వచ్చాయి.

భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం సిడ్నీలోని ఒలంపిక్ స్టేడియంలో మోడి ప్రసంగం జరిగింది. వేదికపైకి మోడి వచ్చే సమయానికి స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ప్రజల కరతాళ ద్వనులు, నమో నినాదాల  మద్య నీలి, గోధుమ వర్ణ దుస్తుల్లో విశ్వాసం ఉట్టిపడేలా ప్రధాని వేదికపైకి వచ్చారు. అనంతరం నగరంలో తనకు లభించిన స్వాగతం, సభకు వచ్చిన స్పందన చూస్తే చాలా సంతోషం కలుగుతుందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించి ప్రధాని అయిన తొలి భారతీయుడిని తానే అని ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారత్ లో రాత్రి విమానం ఎక్కితే ఉదయం సిడ్నీ లో దిగవచ్చు అయినా.... గత 28సంవత్సరాల్లో ఏ భారత ప్రధాని కూడా ఆస్ర్టేలియాకు రాలేదన్నారు. తదుపరి ప్రధాని రాక కోసం మరో 28ఏళ్ళు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదన్నారు.

దేశం కోసం జీవిద్దాం

భారతీయులుగా పుట్టిన మనం భరతమాత కోసం చనిపోయే అవకాశం లేదు. ఎందరో మహాత్ములు, త్యాగధనులు ఆ పని చేసి మనకు స్వాతంత్ర్యం అందించారు. కాబట్టి ఇప్పుడు మనం భారతమాత కోసం జీవిద్దాం.., తల్లి కోసం కష్టపడుదాం అని పిలుపునిచ్చారు. భారతమాతకు 250కోట్ల చేతులు ఉంటే అందులో 200చేతులు యువతరానివి అని చెప్పారు. ఏ దేశానికి లేనంత యువ సంపద భారత్ కు ఉందన్నారు. ఇది త్వరలోనే దేశ కలలను నిజం చేసే సత్తా మన యువతలో ఉందని స్పష్టం చేశారు. దేశ యువత, సహజ వనరులను సక్రమంగా వినియోగిస్తే.., అతుల్య భారత్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కేవలం కండబలం ఉంటే సరిపోదు.., బుద్దిబలం కూడా ఉండాలని పిలపునిచ్చారు. ఈ బుద్ధిబలం భారత్ లో పుష్కలంగా ఉందన్నారు.

ఆస్ర్టేలియా అభివృద్ధిలో భారత్ పాత్ర

ఇక భారత్ -ఆస్ర్టేలియా సంబంధాలపై ప్రధాని నరేంద్రమోడి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆస్ర్టేలియా అభివృద్ధి వెనక భారతీయుల పాత్ర ఉందన్నారు. సుమారు 200 సంవత్సరా క్రితమే భారతీయులు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారనీ.., పరాయి దేశం అయినా సొంత ఊరిలా అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. 1964లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగినప్పుడు మక్త్వార్ సింగ్ సమురాయ్ ఆస్ట్రేలియాకు ప్రతినిధిగా వెళ్లారు, ఒలింపిక్స్లో భారతీయుడు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడం చిన్నవిషయం క:గా అని చెప్పారు. అదేవిధంగా  రెడ్ సెలస్, స్టూవర్ట్ క్లార్క్ ఇద్దరూ ఆంగ్లో ఇండియన్లే.., 1000 పరుగులు, 100 వికెట్లు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ లీనా పూణెలో జన్మించింది. 12 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్, మ్యాథ్స్ ఒలింపియాడ్లలో ఆస్ర్టేలియా పేరు నిలబెట్టిన అక్షయ్ భారతీయుడు అని వివరించారు. ఇలా భారతీయులు ఆస్ర్టేలియా అభివృధ్ధిలో భాగస్వాములుగా ఉన్నారని  పలు ఉదాహరణలు వివరించారు.

నమ్మకం ఆత్మవిశ్వాసం నిలబెతా

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆస్ర్టేలియాలోని భారతీయులు ఓటేయలేదు. అయినా సరే వారు అనుక్షణం దేశం గురించే ఆలోచించారనే విషయం తెలుసు. ఎవరు గెలుస్తారు అనేకంటే.., ఎలా అభివృద్ధి చేస్తారు. ఎవరయితే బాగా పనిచేస్తారనే విషయాన్నే ప్రజలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అని మోడి చెప్పారు. దేశ ప్రజలు, విదేశాల్లోని భారతీయులు తనపై పెట్టుకున్న నమ్మకాలు, ఆశలను కర్తవ్యంగా స్వీకరించి కష్టపడి దేశాన్ని వృధ్దిలోకి తీసుకొస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకం వల్ల ప్రస్తుతం పేదలు కూడా బ్యాంకులకు వెళ్తున్నారని వివరించారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులను వినియోగించుకుంటానని మోడి చెప్పారు. గ్రామాలకు తాగు నీరు, పారిశుద్యం, మరుగుదొడ్లతో  పాటు వారికి ఉపయోగపడే, అభివృద్ధికి సహకరించేలా అనేక పధకాలు ప్రవేశపెట్టానని వెల్లడించారు.

ఇలా భారత్ అభివృద్ధిపై దేశ, విదేశాల్లోని భారతీయులు పెట్టుకున్న కలలను నెరవేరుస్తానని మోడి మాట ఇచ్చారు. ఈ ప్రసంగంతో ఒలంపిక్ స్టేడియం అంతా భారత్ మాతాకి జై...,, జయహో మోడి నినాదాలతో హోరెత్తింది. ఒక వ్యక్తి శక్తిలా మారి ప్రపంచాన్ని శాసించటం అంటే ఇదేనేమో. మాటలతో మనుషుల్ని మంత్రముగ్ధులను చేయగల సత్తా మోడి సొంతం. అది సిడ్నీ ప్రసంగంతో మరోసారి నిరూపితమైంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  sydney  speech  australia  latest news  indians  

Other Articles