మనం ఇంట్లో చేసుకునే చపాతీలు మహా అయితే ఒక ప్లేటు సైజులో ఉంటాయి. అదే బయట ఫంక్షన్లకు వెళ్తే అక్కడ వంట మాస్టర్లు చేసే చపాతి (రుమాలి రోటి) పెద్దగా ఉంటుంది. దాన్ని చూస్తేనే మనం ఆశ్చర్యంగా భావిస్తాం. ఇంత పెద్దగా ఎలా చేస్తారు అని తయారీ విధానంను తదేకంగా చూస్తుంటాం. కాని ఈ చపాతి (రోటి) గురించి తెలిస్తే మాత్రం నోరు తెరవకుండా ఉండలేరు. ఏకంగా మనిషి పొడవైన చపాతిని ఇక్కడ తయారు చే్స్తున్నారు. ఎలాంటి యంత్రాలు, పరికరాలు లేకుండా పూర్తి సాంప్రదాయ, పురాతన పద్దతుల్లో రాతి బండపై పిండిని కొట్టి దాన్నే మనిషి పొడవు గల చపాతీగా క్షణాల్లో మార్చేస్తున్నారు. పలచగా ఉండటమే కాకుండా కాస్త కూడా చినుగు పోకుండా ఈ రోటి ఉండటం ప్రత్యేకత. కావాలంటే మీరు ఈ వీడియో చూడండి.
ఇదెక్కడో కాదు మన దేశంలోనే.. మన భారతీయులే ఈ పెద్ద రోటిని చేస్తున్నారు. వీటిని స్థానికంగా జరిగే ఫంక్షన్లలో తినటానికి ఉపయోగిస్తారట. అంత పెద్దవి ఎలా తింటారు అని ఆశ్చర్యపోకండి. పెద్ద రోటీని ముక్కలుగా కోసి వడ్డిస్తారు. ఇక సోదర దేశం పాకిస్థాన్ లో కూడా అచ్చం ఇలాంటి చపాతీలే చేస్తున్నారు. ఎంతయినా వారు మన నుంచి విడిపోయిన వారే కదా.., ఇక్కడి ఆచారాలు, సాంప్రదాయాలే దాదాపు అక్కడా అమల్లో ఉంటాయి. ఆ ప్రకారంగా పాక్ లోని ఖైబర్ జిల్లా బన్ను ప్రాంతంలో జరిగే వేడుకలకు ఇలా పెద్ద చపాతీలే ఉపయోగిస్తారట.
సాధారణంగా దొరికే గోధుమ లేదా మైదా పిండినే తీసుకుని ఎలాంటి కృత్రిమ పధార్ధాలు కలపకుండా వీటిని తయారు చేస్తారు. కేవలం ఒక తయారీదారుడు, ఒక అసిస్టెంట్ ఈ చపాతీ తయారికి సరిపోతారు. వీరిద్దరూ కలిసి ఫంక్షన్లకు వచ్చే వందల మందికి చపాతిలు తయారుచేసి పెడతారట. వాహ్.., ఆరు గజాల చీరను అగ్గిపెట్టెలో పెట్టిన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసినా.., ఇలా అతిపెద్ద చపాతీలు చేతితో సునాయసంగా చేసినా.., అది భారతీయులకే చెందుతుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more