Rjd chief lalu prasad is expired medicine says ram vilas paswan

lalu prasad, nri comments, ram vilas paswan, expired medicine, narendra modi

RJD chief lalu prasad is expired medicine says ram vilas paswan

లాలూ.. ఎక్స్ ఫైరీ తీరిన మందులాంటి వారు..!

Posted: 11/18/2014 09:44 PM IST
Rjd chief lalu prasad is expired medicine says ram vilas paswan

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నారైగా అభివర్ణించిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్కు ఒకనాటి ఆయన మిత్రుడు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గట్టి ఝలక్ ఇచ్చారు. ఇన్నాళ్ల పాటు లాలూ విషయంలో మౌనంగా వుంటూ వఃచ్చిన ఆయన ఒక్కసారిగా విమర్శల పర్వాన్ని అందుకున్నారు. లాలూ ప్రసాద్ కాలం చెల్లిన మందులాంటి వారని ఘాటు విమర్శలు చేశారు. దానివల్ల రోగం తగ్గక పోగా, దుష్ప్రభావాలు కలుగుతాయని విమర్శించారు. ఆ మందు వల్ల ఉపయోగం ఏమీ ఉండదన్నారు.

ఇప్పుడు ఆ పార్టీ అధినేత పాశ్వాన్ మోదీ మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. తన పాత మిత్రుడిని ఆయన కాలం చెల్లిన మందుగా వర్ణించారు. ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్ మరో అడుగు ముందుకేసి, లాలూజీ ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇక విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. ఒకప్పుడు ఆర్జేడీకి మిత్రపక్షంగా ఉన్న ఎల్జేపీ.. ఇప్పుడు బీజేపీకి సన్నిహితంగా వెళ్లిన సందర్భంలో విమర్శలను ఎక్కుపెట్టింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalu prasad  nri comments  ram vilas paswan  expired medicine  narendra modi  

Other Articles