Rashtriya janata dal janata dal united wont merge says nitish kumar

RJD, JD-U, Nitish Kumar, Bihar, BJP, PM Narendra Modi, lalu prasad yadav, Rashtriya janata dal, janata dal united, merge

Rashtriya janata dal, janata dal united wont merge says nitish kumar

రెండు పార్టీల విలీనం కథనాలలో నిజం..

Posted: 11/18/2014 10:03 PM IST
Rashtriya janata dal janata dal united wont merge says nitish kumar

బీహార్లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లు విలీనంకాబోతున్నట్టు వచ్చిన వార్తలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీ యూ నేత నితీష్ కుమార్ తోసిపుచ్చారు. ఈ రెండు పార్టీలు విలీనం కాబోవని నితీష్ స్పష్టం చేశారు. గత ఉప ఎన్నికలలో రెండు పార్టీలు కలసి బీజేపికి షాక్ ఇచ్చాయి. దీంతో ఈ రెండు పార్టీలు కలిస్తే బీహార్ లో బీజేపికి చుక్కెదురవుతుందన్న కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ రెండు పార్టీలు మళ్లీ ఒక్కటి అవుతున్నాయిని, రెండు పార్టీలో కలిసే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను ఎదుర్కోంటాయని జాతీయ మీడియా కథనాలను వెలువరించింది. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కథనాలు మీడియా కల్పితాలేనని తోసిపుచ్చారు.

కాగా వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ యూ, ఆర్జేడీ కలసి పోటీ చేయనున్నట్టు నితీష్ చెప్పారు. ఇరు పార్టీలు విలీనమయ్యే ప్రసక్తేలేదని, ఒకే కూటమిగా మాత్రమే పోటీ చేస్తాయని తెలిపారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించడానికి సెక్యులర్ పార్టీలన్ని ఏకంగా కావాలని నితీష్ పిలుపునిచ్చారు. ఆర్జేడీ, జేడీ యూ విలీనమైతే ఉపయోగంగా ఉంటుందని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నితీష్ వివరణ ఇచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RJD  JD-U  Nitish Kumar  Bihar  BJP  PM Narendra Modi  lalu prasad yadav  Rashtriya janata dal  janata dal united  merge  

Other Articles