Ap capital area developement authotrity constituted by chandrababu

ap capital area developement authotrity, crda chandrababu, andhra pradesh crda latest updates, chandrbabu naidu latest news, andhra pradesh land pooling problems, latest telugu news updates, andhra pradesh cabinet

ap capital area developement authotrity constituted by chandrababu : andhra pradesh governement formed capital area developement authority for solving capital area issues and also to take actions for area development. crda is chaired by chandrababu naidu and vice chairman is muncipal minister

అడ్డంకులు తొలగించేందుకు బిల్లు...

Posted: 11/19/2014 07:44 AM IST
Ap capital area developement authotrity constituted by chandrababu

ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉన్న అడ్డుంకులు తొలగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీ.ఆర్.డీ.ఎ)ను ఏర్పాటు చేస్తూ రూపొందించిన బిల్లును ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. రాజధానికి సంబంధించిన అన్ని అధికారాలు ఈ సంస్థకు అప్పగిస్తూ బిల్లును రూపొందించారు. ప్రణాళఇక, ఆదాయ-వ్యయం, శాఖల సమన్వయం, నిర్మాణ పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం, కొత్త ప్రాంతాలను కలపటం.. ప్రస్తుతం ఉన్న ప్రాంతాల తొలగింపు, మార్పులు ఇతర అంశాలన్నిటినీ ఈ కమిటి స్వయంగా పర్యవేక్షిస్తుంది.

రాష్ర్ట నూతన రాజధానిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. భూ సేకరణ ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ప్రతిపక్ష విమర్శలు తీవ్రమవుతున్నాయి. రైతులను ఇబ్బంది పెడుతూ బలవంతంగా భూములు సేకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు రాజధాని నిర్మాణంపై ప్రభుత్వంలో శాఖల మద్య సమన్వయం కొరవడింది. ఈ నేపథ్యంలో సమస్యలన్నిటికి పరిష్కారం చూపించేలా సీ.ఆర్.డీ.ఏ.ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఆమోదించిన ఈ బిల్లుతో రాజధాని నిర్మాణంపై సర్వ హక్కులు ఈ సంస్థ చేతుల్లోనే ఉంటాయి. సంస్థ అద్యక్షుడు గా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపాద్యక్షుడుగా పురపాలక శాఖ మంత్రి వ్యవహరిస్తారు. వీరితో పాటు రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునే పది శాఖల ముఖ్య కార్యదర్శులు, రాజధాని పరిధిలోని పురపాలక సంస్థల మేయర్లు, ద.మ.రైల్వే జోనల్ మేనేజర్ సభ్యులుగా వ్యవహరిస్తారు.

ఈ సంస్థ ప్రధానంగా భూ సేకరణపై దృష్టి పెడుతుంది. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చేందుకు వస్తున్న అభ్యంతరాలను పరిష్కరిస్తుంది. అంతేకాకుండా భవనాల నిర్మాణం, రాజధాని పరిధిలో నియమ నిబంధనలు, రాజధాని పరిధిలో సంస్థలతో ఒప్పందాలు, రూ.100కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్ల ఆమోదం, మౌలిక సదుపాయాల రుసుం విధించటం తదితర హక్కులు సంస్థకు అప్పగించటం జరిగింది. వినియోగ చార్జీల వసూలు, సవరణాధికారం కూడా సంస్థకు ఉంది. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం, అభివృధ్ధి కోసం ప్రత్యేకంగా రాజధాని ప్రాంత అభివృద్ధి నిధి (సీ.ఆర్.డీ.ఎఫ్) ఏర్పాటు చేసే అవకాశం కూడా బిల్లుకు ఉంది. దీంతో పాటు ప్రభుత్వ పధకం ద్వారా నిర్వాసితులైన వారికి ఈ సంస్థ సహాయం చేస్తుంది. అంటే ప్రత్యేక పధకాలు, ఆర్ధిక సాయం, ఉపాధి వంటి మార్గాల ద్వారా వారికి న్యాయం చేస్తుంది. ఇలా రాజధాని నిర్మాణంకు ఎవరూ అడ్డుపడే అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బిల్లును రూపొందించి చట్టంగా మార్చాలని ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా రాజధాని ప్రాంతంలో వస్తున్న సమస్యలను పరిష్కరించటంతో పాటు, ఆ ప్రాంత అభివృద్ధి, నియంత్రణ అంతా ప్రభుత్వ స్వీయ పర్యవేక్షణలో ఉండేలా నిర్ణయం తీసుకుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital  chandrababu naidu  crda  latest news  

Other Articles