ఆడపడచు పెళ్లంటే..కన్నవారికి ఓ బరువు. అంతేకాదు బాధ్యత, ఓ మధుర జ్ఞాపకం.. ఎంత లేని వారైన తమకు కలిగిన దాంట్లో.. కూతరు పెళ్లిని అంగరంగ వైభవంగా జరపాలని చూస్తారు. ఇక ఉన్నవారి విషయం చెప్పనక్కర్లేదు. ముత్యాల పందిళ్లు, రత్నాల తలంబ్రాలు, ఘుమఘుమలాడే ప్రత్యేక వంటలు, రెడ్ కార్పెట్ డిన్నర్ మాదిరిగా వుంటుంది. ఇందుకు హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్ లో జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహమే తాజా ఉదాహరణ. అయితే వీటన్నింటికీ భిన్నంగా తన కూతరు పెళ్లి జరిపించాడు ఓ మంత్రి. భిన్నంగా అంటే ఎలా అంటారా..?
ఆడపిల్ల పెళ్లంటే.. ఖర్చుకు వెనకాడకుండా.. అప్పు చేసైనా పెళ్లిళ్లు చేసే ఈ రోజులలో కర్ణాటక రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి తన కుమార్తె అనుపమ వివాహాన్ని అతి నిరాడంబరంగా, సామూహికంగా జరిపించారు. మంత్రి ఆంజనేయ తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా నిర్వహించారు. తన కుమార్తె కోసం దాచిన మొత్తంతో సామూహిక వివాహాలను నిర్వహించి.. అదే వేదికపై తన కుమార్తె వివాహాన్ని సైతం జరిపించి నేటి తరం రాజకీయ నేతలందరికీ ఆదర్శంగా నిలిచారు. పుట్టింటి వాళ్లు ఎంత పెట్టినా.. ఇంకా ఇది కావాలి, అది కావాలని పేచీ పెట్టుకుంటున్న అమ్మాయిలు వున్న ఈ కాలంలో.. తన తండ్రికి కలిగిన మంచి ఆలోచనను యధాతధంగా అమలు పర్చేలా చేసిన మంత్రిగారి కూతరు, అలుళ్లకు కూడా అభినందనలు వెల్లివిరుస్తున్నాయి.
చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిగాయి. ఈ వేధికపైనే మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రివర్గ సహచరులు, పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సామూహిక వివాహాల్లో ఒక్కటైన జంటలకు ఒక్కొక్కరికీ ఒక్కో జెర్సీ ఆవును మంత్రి అంజనేయ కానుకగా అందించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more