తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో కరెంటు కష్టాలు నెలకొన్న నేపథ్యంలోవ వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తాను చెప్పినట్లు చేస్తే.., తెలంగాణకు కరెంటు తెప్పిస్తానని ఆఫర్ ఇచ్చారు. సోదర రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ తో కేసీఆర్ సరిగా మెలిగితే కరెంటు తెప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కరెంటు కష్టాలకు ఏపీ ప్రభుత్వం కారణం అంటున్న తెలంగాణ సర్కారు ఆరోపణలపై టీడీపీ నేత స్పందించారు. కేటాయింపుల కంటే ఎక్కువగా ఏపీ వాడుకుంటే.. అఖిలపక్షం వేసి లెక్కలు తేల్చాలన్నారు. ఆరోపణలు నిజమని తేలితే., అధికంగా వాడుకుంటున్న విద్యుత్ ను వెనక్కి తీసుకొస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి విషయానికి చంద్రబాబును టార్గెట్ చేయటాన్ని ఎర్రబెల్లి తప్పుబట్టారు. కేసీఆర్ వ్యవహార శైలి సరిగా లేదన్నారు. పొరుగు రాష్ర్టాలు, కేంద్రంతో సఖ్యతగా ఉండటం లేదని విమర్శించారు. ఇలా చేయటం వల్ల తెలంగాణ నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరెంటు కష్టాలపై మాట్లాడిన ఎర్రబెల్లి.., ఏపీ దగ్గర మిగులు విద్యుత్ ఉందన్నారు. తెలంగాణ సర్కారు చంద్రబాబుతో మంచిగా ఉంటే మిగులు విద్యుత్ ను రాష్ర్టానికి తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. విద్యుత్ సమస్య తీరేందుకు మూడు సంవత్సరాలు అవసరం లేదనీ.., సీఎం సరేనంటే మూడు నెలల్లో పరిష్కారం చూపుతామన్నారు. మూడు నెలల్లో వెయ్యి మెగావాట్లు ఇప్పిస్తామన్నారు.
రాష్ర్టంలో విద్యుత్ కష్టాలకు గత ప్రభుత్వాల విధానాలతో పాటు, ప్రస్తుత చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరి కారణమని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి ఇలాంటి సమయంలో విద్యుత్ కష్టాలు తీరుస్తామన్న ఎర్రబెల్లి మాటలు విని., సౌమ్యులుగా ఉంటారో.,, లేక తమ పోరు కొనసాగిస్తారో తెలియాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణ సఖ్యతగా ఉన్నా.., ఏపీ నుంచి విద్యుత్ తేవటంలో ఎర్రెబెల్లి ఎంతమేర సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి. అటు ఈ అంశంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ., రెండు రాష్ర్టాలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు. అయితే వైరి పక్షాల మద్య ప్రజలు నలిగిపోవటమే తప్ప.. సమస్యకు పరిష్కారం ఉండదు అని అర్థమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more