2014 become most hottest year in the 21st century

hot year 2014, world most hot year 2014, country wise 2014 highest hot temperatures, global warming latest news update, radiation effect in environment, summer heat country wise, latest news updates, 21st century miracles sad incidents

2014 become most hottest year in the 21st century : america based organisation told that in 2014 world heat temperature rate increased and become most temperatured hot year in 21st century

అత్యంత ‘హాట్’ సంవత్సరంగా 2014 రికార్డు నమోదు

Posted: 12/01/2014 12:54 PM IST
2014 become most hottest year in the 21st century

పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రబావాలు ప్రపంచంపై ప్రభావం చూపటం మొట్టాయి. దీని ఫలితంగా ప్రపంచంలో ఉష్ణోగ్రతలు ఏటా పెరుగుకుంటూ పోతున్నాయి. తాజాగా అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ర్టేషన్ ఈ విషయం వెల్లడించింది. చరిత్రలో 2014 అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా ప్రకటించింది. ఉష్ణోగ్రతలు నమోదు చేయటం 1880లో మొదలయింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రస్తుత సంవత్సరంలోనే ఎక్కువగా వేడి నమోదయినట్లు ఎన్.ఓ.ఏ.ఏ. తెలిపింది.

ఇప్పటివరకు 2010లో అత్యధిక ఎండలు నమోదైన సంవత్సరంగా రికార్డు ఉండేది. అయితే నాలుగు సంవత్సరాలుగా కాస్త తగ్గుముఖం పట్టిన వాతావరణ వేడి మళ్ళీ ఒక్కసారిగా పెరిగిందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా 20వ శతాబ్దంతో పోలిస్తే ప్రస్తుత 21వ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పింది. ప్రతి ఖండంలో, ప్రతి సముద్రంలో 2డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు పెరిగాయని స్పష్టం చేసింది. అంటే భూమిపై ఈ ఏడాది రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందన్నమాట. ఈ తరహాలో ఏటా రెండు డిగ్రీలు పెరుగుకుంటూ పోతే.., సమీప భవిష్యత్తులోనే పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తోంది.

ఉదాహరణకు ప్రస్తుత ఏడాది 45గా ఉన్న ఉష్ణోగ్రతలు వచ్చేసారి 47, అలా ఏడేళ్ళలో ఉష్ణోగ్రతలు ఏకంగా అరవై డిగ్రీలకు చేరుకుంటాయి. టెంపరేచర్ నలబై డిగ్రీలుంటేనే ఇలా ఉంటే., అరవై ఉంటే పరిస్థితి ఏమిటనేది ఊహించుకోవచ్చు. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే ముప్పు తప్పదని 2009లో జరిగిన కోపెన్ హగెన్ సదస్సు హెచ్చరించింది. రేడియేషన్, వాతవరణ కాలుష్యం, గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ కారణంగా భూ వాతావరణం వేడెక్కుతుంది. కాలుష్యం, రేడియేషన్ తగ్గించేందుకు నిబంధనలు కఠినతరం చేయాలి. చెట్లను పెంచటాన్ని ప్రోత్సహించి.. చెట్లు నరికేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే కాస్త ఉపశమనం ఉంటుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hot year  2014  21st century  summer  temperatures  

Other Articles