Shweta basu now becomes script consultant

Shweta Basu prasad new job, Shweta Basu prasad job in phantom productions, Shweta Basu prasad as script consultant, Shweta Basu prasad job details, Shweta Basu prasad latest news updates, phantom productions next movies, anurag kashyap on shweta basu prasad, anurag kashyap next movies, tollywood latest news updates

Shweta Basu now becomes script consultant : Shweta Basu working as a script consultant for Phantom Productions. shweta basu new job is to go through the scripts and pick the promising ones that could be made into a movie.

కొత్త అవతారమెత్తిన శ్వేత బసు

Posted: 12/01/2014 01:31 PM IST
Shweta basu now becomes script consultant

సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయి, ఈ మద్య విడుదలైన నటి శ్వేత బసు ప్రసాద్ ఇప్పుడిప్పుడే సాధారణ జీవితం గడుపుతోంది. రెస్క్యూ హోం నుంచి విడుదలైన తర్వాత ఎక్కువశాతం ఇంటికి పరిమితం అయిన శ్వేతకు పలు సినిమా చాన్సులు కూడా వచ్చాయి. అయితే ఆఫర్లకు కొద్ది సమయం తీసుకుని ఓకే చెప్పాలని ఆమె భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లోపు ఖాళీగా ఉండకుండా పని చేయాలని డిసైడ్ కావటంతో పాటు.., జాయిన్ కూడా అయిపోయింది. ఫాంతమ్ ప్రొడక్షన్స్ లో స్ర్కిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేస్తోంది.

ఈ ఫాంటమ్ ప్రొడక్షన్స్ ను ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో పాటు మదు మంతెన, వికాస్ బల్, విక్రమాదిత్య మొత్వాని కలిసి నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్వేత పని ఏమంటే.., ప్రొడక్షన్ హౌజ్ కు వివిధ స్క్రిప్ట్ రైటర్లు, కథా రచయితల నుంచి వచ్చే స్టోరీలను పరిశీలించి వాటిలో ఏవి సినిమాగా తీస్తే బాగుంటుందో ఎంపిక చేసి సంబంధిత డైరెక్టర్ కు సూచిస్తుంది. అంతేకాకుండా కథలోని లోపాలను చూపించి అప్రమత్తం చేస్తుందన్నమాట. పని చేయటం వల్ల మనసు ధ్యాస మల్లిపోవటంతో పాటు.., కథల ఎంపికపై బాగా పట్టు సాధించవచ్చు అని శ్వేత చెప్తోంది.

అంతేకాకుండా ప్రొడక్షన్ హౌజ్ కు వచ్చే ప్రముఖుల పరిచయాలతో మంచి సినిమా ఛాన్సులు వస్తాయని ఈ నటి ఆశిస్తోంది. ‘కొత్త బంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్వేత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అనుకోని పరిస్థితుల్లో వ్యభిచారం కేసులో అరెస్టయి.., రెస్క్యూ హోంకు తరలించబడింది. ఆమె తల్లి పిటిషన్ దాఖలు చేయటంతో కోర్టు శ్వేతకు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం కొత్త జీవితం ప్రారంభించిన ఈ నటి ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shweta Basu prasad  anurag kashyap  phantom productions  script consultant  

Other Articles