Bihar panchayat orders gang rape victim to take rs 50 thousand and get abortion

Bihar, village panchayat, order, gang rape, victim, Rs. 50 Thousand, abortion, pregnant, Packola Palashmani, Kishanganj district

Bihar panchayat orders gang rape victim to take Rs. 50 Thousand and get abortion

యువతి శీలం ఖరీదు రూ. 50 వేలా.? ఖరీదు కడతారా..?

Posted: 12/05/2014 12:02 AM IST
Bihar panchayat orders gang rape victim to take rs 50 thousand and get abortion

సభ్య సమాజం నిజంగా సిగ్గుతో తలదించుకునే ఘటన. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించిన గ్రామ పంచాయితీ తీర్పు. మనుషులేనా.. వీళ్లు.. మానవ మృగాళ్ల అన్న సందేహం రేకెత్తే స్థాయిలో వారి తీర్పు... నేరానికి పాల్పడిన వారిని సంరక్షించే ప్రయత్నాల్లో పంచాయితీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఓ అభాగ్య గర్భవతిని వీధిపాలు చేశాయి. పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చిందనే కారణంతో కరుడుగట్టి, కాఠిన్యమైన తీర్పును వెలువరించారు. కామ మధం తలకెక్కి నలుగరు మగ మృగాళ్ల అకృత్యానికి బలైన తనకు న్యాయం చేయమని వేడుకున్న ఓ నెలల గర్భవతికి ఎదురైన దుస్థితి ఇది.

నలుగురు గ్రామ యువకులు తనను బంధించి ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారని.. ఫలితంగా తాను గర్భం దాల్చానని.. వారిని కఠినంగా శిక్షించాలని గ్రామ పంచాయితీ పెద్దలను ఆశ్రయించిన ఆ యువతికి చిత్కారాలు ఎదురయ్యాయి. నేరం చేసిన నలుగురు యువకులను ఏమీ అనకుండా.. యువతిదే తప్పంటూ నిప్పులు చెరిగారు. జరిగిందేదో జరిగిపోయింది... యాభై వేల రూపాయలు తీసుకుని అబార్షన్ చేయించుకోమ్మని పెద్దలు సూచించారు. గ్రామమంతా ఒక్కటిగా నిలబడగా.. ఆ బాధితురాలు మాత్రమే ఒంటరిగా నిలబడింది. గ్రామ పంచాయితీ ఇచ్చిన తీర్పు బీహర్ రాష్ట్రంలో ఇప్పడు కలకలం సృష్టిస్తుంది.

గత ఏడు నెలల క్రితం  ఓ యువతి నలుగురు యువకుల చేతిలో అత్యాచారానికి గురైంది. అనంతరం తనకు  న్యాయం చేయాలంటూ కృష్ణ గంజ్ జిల్లాలోని పక్లోవా పలష్మానీ గ్రామ పంచాయతీని ఆశ్రయించింది. అయితే అక్కడ ఆ యువతికి ఎటువంటి న్యాయం జరగలేదు.  తాజాగా బాధితురాలు మరోమారు పంచాయితీ తలుపు తట్టింది. చేయని తప్పుకు తాను శిక్షను అనుభవిస్తున్నానని, తప్పు చేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని వారిని శిక్షించాలని కోరుతూ మరోసారి పంచాయతీ గడప తొక్కింది.  కాగా, ఆమెపై ఆ పంచాయతీ పెద్దలు వివక్ష చూపించారు. రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు.  దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయడంతో పాటు, ఆ నిందితులకు శిక్ష పడాలని గ్రామ పంచాయతీ వద్ద మొరపెట్టుకున్నా నిరాశే ఎదురయ్యిందని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.
 
ఆ గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోగా డబ్బు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలని సూచించినట్లు పోలీస్ అధికారి శ్వేతా గుప్తా స్పష్టం చేశారు. రాజస్థాన్ నుంచి ఇక్కడకు వలస వచ్చిన ఆ బాలిక చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయని.. ఆ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసులో డబ్బులో తీసుకోవాలని సూచించిన పంచాయతీ అభ్యర్థిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles