ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ విధాన ప్రకటనపై రాష్ట్ర రైతాంగంలో అనేక ప్రశ్నలకు అస్కారమిస్తున్నాయి. ప్రభుత్వ విధాన ప్రకటనపై వారు ఆందోళనలో పడ్డారు. రాష్ట్ర రైతాంగమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన రుణమాఫీ విధాన ప్రకటన కేవలం ప్రచారానికే పనికొస్తుందని, తమ రుణాలను తీర్చే మార్గాన్ని తమకే వదిలేశాని రైతులు నిట్టూరుస్తున్నారు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నింటీనీ మాఫి చేస్తామన్ని చెప్పిన చంద్రబాబు.. తీరా విధాన ప్రకటనలో మాత్రం కేవలం పంటరుణాలకే రుణమాఫీ వర్తస్తుందని చెప్పడం రైతులను కలవరానికి గురిచేస్తోంది.
లక్షన్నరలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అసలు వడ్డీ రెండింటినీ కలిపి ఆ మొత్తానికి మినహయిస్తామని నిర్ణయం తీసుకోవడంతో రైతులు రుణాల మాఫీ.. లక్ష రూపాయాల లోపే తీసుకున్న వారికే వర్తించనున్నట్లు రైతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి దశలో అసలు వడ్డీ కలపి కేవలం యాభై వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికే మినహాయింపు వర్తించనుంది. బంగారం రుణాలు, హార్టీ కల్చర్ రుణాలు వాయిదా వేశారు. ముందు పంట రుణాలే మాఫీ ముఖ్యం అన్నారు. అవన్నీ అలా ఉంటే.. ఇప్పటికైతే రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు పంట రుణాలు మాత్రం చెల్లిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు రైతు రుణమాఫీపై విధాన ప్రకటన చేయడంపై రైతాంగాన్ని విస్మాయానికి గురి చేస్తోంది.
గత పదేళ్లుగా రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారని, వారి కష్టాలను చూడలేక పోయానని, అందుకోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా తాను రుణమాఫీ చేస్తానని హామి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పుకోచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభత్వం మాత్రం.. ఆచరణలో ద్వంద వైఖరిని అవలంభిస్తుందన్న టాక్ వస్తోంది. 2004 నుంచి రైతాంగం కష్టాలు పడుతుంటే 2007 నుంచి రుణమాఫీ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై కూడా రైతాంగం మండిపడుతోంది. మరోవైపు 2007లో పాతిక వేల రూపాయల రుణం పొందిన రైతలు మొత్తం ఈ పాటికి యాభై వేల రూపాయలు మించుతుంది. దీని బట్టి గత రెండేళ్లలో లక్ష పాతిక వేల రూపాయలను రుణంగా పొందిన రైతులకే నిజంగా లబ్ధి ప్రభుత్వ లభ్ది ఆశించిన మేర దక్కుతుంది.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ల కొనసాగిన చంద్రబాబు.. అప్పట్లో రాష్ట్ర రైతాంగాన్ని విస్మరించారని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్రంలో హైటెక్ సీటీ, స్టేడియం, సాప్ట్ వేర్ సంస్థలకు ప్రోత్సాహం, రోడ్ల అభివృద్ది, ఇత్యాదులను మాత్రమే పట్టించుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు.. రైతాంగం కోసం ఏ నాయకుడి చేయనన్ని పాదయాత్రలు చేశారని, బాబుకు తమ కష్టాలు అర్థమయ్యాయని భావించిన రైతంగానికి రుణమాఫీ విధాన ప్రకటనలో మరో సారు షాక్ తగిలింది. ఒకే భూమి మీద యజమాని, కౌలురైతు ఇద్దరు రుణం తీసుకుంటే కౌలురైతుకే ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించడంతో కౌలు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గుర్తింపుకార్డు ఉన్న కౌలురైతు రుణమాఫీకి వర్తిస్తుందని చెప్పడంతో కొందరు నిరుత్సహాపడుతున్నారు.
ఎన్నికలలో డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని హామి ఇచ్చిన చంద్రబాబు.. అదికారంలోకి వచ్చాక వారి రుణాలను మాఫీ చేయడంలో కూడా పరిమితిని విధించారు. డ్వాక్రా మహిళలకు కేవలం పది వేల రూపాయల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించడం మహిళలను మండిపడేలా చేస్తోంది. దానికి కూడా త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు తమ రుణాలను మాఫీ చేస్తాడని కొండంత ఆశ పెట్టుకున్న మహిళలకు ఇప్పడు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి.
టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని స్పష్టంగా రాసుకున్నా అమలు చేయడంలో మాత్రం తన మార్కు చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నాడని విపక్షాలు ఆగ్ర హాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అధికారమే పరమావధిగా భావించిన చంద్రాబాబు.. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసి.. అధికారంలోకి వచ్చాక అర్థిక ఇబ్బందులు, అప్పులను చూపుతున్నారని మండిపడతున్నాయి. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర పునర్విభజన తరువాత అర్థిక పరిస్థతి ఎలా వుండబోతోందో తెలియదా..? తెలిసి కూడా హామీలను ఎలా గుప్పించాడని ప్రశ్నిస్తున్నాయి.
వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తానని.. తొలి సంతకం రుణమాఫీపైనే చేస్తానన్న చంద్రబాబుకు అనాటి రైతు రుణాలు మొత్తం 87 వేల కోట్లు, డ్వాక్రా రుణాల మొత్తం 14 వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని తెలియదా అంటూ నిలదీస్తున్నాయి. సుమారు లక్ష కోట్లకు పైగా రుణాలను ఎలా మాఫీ చేస్తారని ప్రత్యర్థులు ప్రశ్నించగా.. రుణాలను ఎలా మాఫీ చేయాలో తనకు తెలుసునని చెప్పిన చంద్రబాబు.. ఆంక్షలు పరిమితులను ఎందుకు విధిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలకు రుణమాఫీ చేయడం ఇష్టం లేదని అందుకే ఈ తరహా ప్రశ్నలు సంధిస్తున్నాయని ఎదురుదాడికి దిగిన చంద్రాబుబు.. ఇలాగేనా రుణాలను మాఫీ చేసేదని నిలదీస్తున్నాయి. విజడమ్ ఆఫ్ ఎకానమీ ఉందని.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో తాను రుణాలను మాఫీ చేస్తానని.. రాష్ట్ర రైతాంగం, డ్వాక్రా మహిళలు ఎవరూ రుణాల కట్టవద్దని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఇప్పడు వారికేం సమాధానమిస్తారని ప్రతిపక్షాలు, ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబుపై కొండంత నమ్మకాన్ని పెట్టుకుని.. టీడీపీని అధికారంలోకి తెచ్చిన ప్రజలకు ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన తొలి బహుమతిగా ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.
చంద్రబాబు ప్రకటనలన్నీ భూటకమే : వైసీపీ
రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రకటనలన్నీ బూటకమేనని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ ధర్నాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని భూమన అన్నారు. అందుకే కుట్రపన్ని అరెస్ట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు న్యాయం చేకూరేలా చంద్రబాబు మెడలు వంచుతామని భూమన అన్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ మహాధర్నాలో పాల్గొందేకు తిరుపతి-చంద్రగిరి నుంచి రైతులు, మహిళలు, యువకులు భారీగా తరలి వెళ్లారు.
బాబు విధాన ప్రకటనలో రుణాల మాఫీ జరగవు: రఘువీరా
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ విధాన ప్రకటనలో అబద్ధాలతో నిండి ఉందని ఏపీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫేస్టోలో కూడా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఇప్పడు మాట తప్పుతున్నారని మండిపడ్డారు. రకరకాల కారణాలతో రైతులకు ద్రోహం చేస్తున్నారని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆరు అబద్ధాలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని రఘువీరా ధ్వజమెత్తారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more