Standing sitting method increases human living life

standing sitting process, standing sittng process health tips, good health tips, how to know a man life living time, human life calculatior, good health simple tips, exercise and body maintance for health, latest news updates

standing sitting method increases human living life : according to a study by Brazilian physician Claudio Gil Araujo. persons who faces risk and problems in flexible and independant sitting standing will lead to live more years

ఇలా చేసి ఎన్నేళ్ళు బతుకుతారో తెలుసుకొండి !

Posted: 12/05/2014 11:00 PM IST
Standing sitting method increases human living life

మనిషికి ప్రాణంపై చాలా తీపి ఉంటుంది. చిన్న గాయం అయినా విలవిలలాడిపోతారు. ఇక చావు గురించి తలుచుకుంటేనే వణుకుపుడుతుంది. అంతా ఎప్పటికైనా మట్టిలో కలవక తప్పదని తెలిసినా ఆ విషయం గురించి ఆలోచించటానికి సాహసించరు. కాని ఇక్కడో వ్యక్తి మీరు ఎన్నేళ్ళలో చనిపోతారో స్వయంగా తెలుసుకొండి అని సవాల్ విసరుతున్నాడు. సింపుల్ టెక్నిక్ ద్వారా మనిషి ఇంకెంతకాలం బ్రతుకుతాడని లెక్కగడుతున్నాడు. బ్రెజిల్ కు చెందిన ప్రముఖ ఫిజీషియన్ క్లౌడియో గిల్ అరౌజో ఈ విధానం రూపొందించాడు.

స్వతహాగా డాక్టర్ అయిన అరౌజో వద్దకు చాలామంది పేషంట్లు వచ్చేవారు. వీరిలో వయస్సు మీదపడినవారిని అరౌజో బాగా పరిశీలించేవాడట. యాబై సంవత్సరాలు పైబడిన వ్యక్తులు సులువుగా కదల్లేరు అని గుర్తించాడు. వేగంగా కూర్చోవటం, వేగంగా పైకి లేవటం, కిందపడిన వస్తువులను ఇబ్బందిలేకుండా వంగి తీసుకోవటం వంటివి చేయటంలో మిగతావారితో పోలిస్తే.., కాస్త ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. అంటే వృద్ధుల్లో మిగతావారితో పోలిస్తే కండరాల పట్టు తక్కువగా ఉంటుందని గమనించి.. దీన్నే ఫార్ములాగా మార్చాడు. సిట్టింగ్-రైజింగ్ టెస్ట్ (ఎస్.ఆర్.టి)ని కనుక్కుని ప్రయోగించి చూశాడు.

తన ఫార్ములాను 51నుంచి 80 ఏళ్ల వయస్సుగల దాదాపు 2వేల మందిపై ప్రయోగించాడు. వారందరికీ ఈ పరీక్ష పెట్టాడు. కూర్చుని.., నిలబడే విధానంను బట్టి ఎనమిది పాయింట్లు కనీస టార్గెట్ గా పెట్టాడు. టెస్ట్ లో 8కంటే తక్కువ పాయింట్లు వచ్చిన వారు మరో ఆరేళ్ళలో చనిపోతారని స్పష్టంగా చెప్పాడు. ఇలా వ్యక్తులకు వచ్చిన పాయింట్లను బట్టి వారు ఎంతకాలం బ్రతుకుతారో చెప్పగలిగాడు. ఈ పరీక్ష ఫలితంకు ఖచ్చితత్వం లేకపోయినా దాదాపుగా వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని అరౌజా అంటున్నాడు.

కూర్చుని నిలుచునే విధానం పైన ఫోటోలో చూపించినట్లుగా ఉంటుంది. ఇక కూర్చుని నిల్చునే సమయంలో కింది ఫోటోలో చూపించినట్లుగా ప్రయత్నిస్తే ఒక్కో దానికి ఒక్కో పాయింట్ చొప్పున తక్కువగా వస్తుంది. ఈ ఫలితం ముఖ్య ఉద్దేశ్యం వ్యక్తుల జీవిత ముగింపు వయస్సును ప్రకటించడం కాదు. మనిషి మరణం వెనక కండరాల పట్టు ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడమే అని డాక్టర్ చెప్తున్నారు. కండరాలు పటుత్వంతో ఉంటే ఎక్కువ కాలం బ్రతకగలరు అని సూచిస్తున్నారు. కాబట్టి మీరు కూడా వయస్సుపై లెక్కలేసుకుని బాధపడకుండా కండరాలు గట్టిపర్చకుంటూ బాడీ బిల్డప్ చేసుకొండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : standing sitting  health  life  latest news updates  

Other Articles