Pavan kalyan fan little shrija discharged from the hospital

Brain Fever, Khammam, super-specialty, Shrija, Pawan Kalyan, Fan, Andhra pradesh, movie news, tollywood news, Telugu cinema news, pavan kalyan fan, pavanism

pavan Kalyan fan little shrija discharged from the hospital

పవన్ కల్యాణ్ కన్నీళ్లకు ఆ మహిమ వుంది..

Posted: 12/05/2014 12:35 PM IST
Pavan kalyan fan little shrija discharged from the hospital

బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతూ జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతూ ఖమ్మం లోని కార్తీక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన పవన్ కల్యాణ్ అభిమాని  శ్రీజ అనారోగ్యాన్ని జయించింది. పూర్తి ఆరోగ్యంగా వున్నా చిన్నారిని డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబసభ్యులు ఆమెను పాల్వంచ తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శ్రీజ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తమ చిన్నారికి వైద్యులు వైద్యం చేస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాణం పోశాడని అన్నారు. తన అభిమాని చావుబతుకుల మధ్య వుందని తెలుసుకున్న ఆయన కారుకు ప్రమాదం జరిగినా వెనుదిరిపోకుండా.. మరో కారులో ఖమ్మం చేరుకుని తమ బిడ్డను చూడటానికి వచ్చారన్నారు.

హుద్ హుద్ తుపాను తో తల్లడిల్లిన విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. చిన్నారి పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకుని.. అక్టోబర్ 17న నేరుగా ఖమ్మం జిల్లాలోని ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని వారు గుర్తు చేసుకున్నారు. దాంతోనే శ్రీజ సగం రోగం నయమైయ్యిందన్నారు. శ్రీజను చూసి అంత పెద్ద అగ్రనటుడు దు:ఖాన్ని దిగమింగుకునే  ప్రయత్నం చేసినా.. తనకు తెలియకుండానే కన్నీళ్లు బయటకు వచ్చాయని, అంత స్వచ్చమైన మనస్సు నుంచి జాలువారిన కన్నీళ్లే చిన్నారి ప్రాణం పోశాయని.. శ్రీజను చూసిన తరువాత ఆయన ఎంతో మనోవేధనను అనుభవించారని అన్నారు. పవన్ కల్యాన్ కన్నీళ్లకు ఆ మహిమ వుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి శ్రీజ ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ హైదరాబాద్ చేరుకున్న తరువాత కూడా వాకాబు చేశారని చెప్పారు. చిన్నారి కోలుకుంటుందని వైద్యలు పవన్ కల్యాణ్ కు చేప్పడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. చిన్నారి శ్రీజ సంపూర్ణ అరోగ్యంతో కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆస్పత్రిలో స్వీట్లు పంచిపెట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles