Congress working under outside pressure in parliament says venkaiah naidu

Congress outside pressure, Parliament, union minister, Venkaiah Naidu, Parliamentary Affairs Minister, Congress under outside pressure, irresponsible and immature, Sadhvi Niranjan Jyoti's controversial remarks

Parliamentary Affairs Minister M Venkaiah Naidu on Saturday alleged that the Congress party is working under outside pressure in Parliament and termed its attitude "irresponsible" and "immature" to protest against his colleague Sadhvi Niranjan Jyoti's controversial remarks.

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా..

Posted: 12/06/2014 03:35 PM IST
Congress working under outside pressure in parliament says venkaiah naidu

పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ సభా కార్యక్రమాలను సజావుగా సాగనీయకుండా చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ సభ్యులు సభా సంప్రదాయాలను మంటగలిపారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని వెంకయ్య అన్నారు. కాంగ్రెస్‌కు ఏం కావాలో...ఏం చేయాలో తెలియదని ఆయన విమర్శించారు.
 
దేశంలో అన్ని రకాల వ్యవస్థలను కాంగ్రెస్‌ నాశనం చేసిందని ఆరోపించారు. పార్లమెంట్‌ నడవకుండా తమాషాలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పార్టీకి ఎం కావాలో వారికే తెలియని అయోమయ పరిస్థితిలో వున్నారని విమర్శించారు. పార్లమెంట్‌ నడవకుండా తమాషాలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నిందించినంత ఎవరూ నిందించలేదని అన్నారు.

కాగా, మోడీని వ్యక్తిగతంగా దూషించే సరికి వెంకయ్యనాయుడుకి వచ్చిన కోపం.. మరి రాహుల్ గాంధీకి రావడంలో తప్పలేదుగా.. అదేలా అంటే సార్వత్రిక ఎన్నికలు ముందు రాహుల్ గాంధీని మోడీ.. తల్లి చాటు బిడ్డ అని, ఆయన పుట్టడమే బంగారు చెంచాతో తిన్నాడని.. యువరాజు అని విమర్శించారుగా అయితే అప్పడేమో అలా స్పందించి.. తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇలా స్పందించడం రాజకీయ నేతలకు తెలిసినంతగా మరెవ్వరకీ తెలియదని వెంకయ్యనాయుడు కూడా నిరూపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : M Venkaiah Naidu  Sadhvi Niranjan Jyoti  BJP  Congress  Parliament  

Other Articles