వారిని విధి వంచించింది. ఆడ, మగ కాని తృతీయ లింగానికి చెందిన వీరు.. తామెందుకు అలా పుట్టామని తొలినాళ్లలో బాధపడతారు. తరువాత సభ్య సమాజం ఈసడింపులతో తమ వర్గానికి చెందిన వారి చెంతన చేరుతారు. అటు పిమ్మట.. వారిని చసి రాటు తేలుతారు. సమాజ నిరాధరణకు గురైన వారిని చదువుకునేందుకు విద్యాసంస్థలు చేర్చుకోవు. తెలిసీ తెలియన తనంతో.. కొంత విని, కొంత చూసి..అనుభవ పూర్వకంగా కొంత నేర్చుకుని సబ్య సమాజంలో తమకు చోటుందని ఇప్పుడిప్పుడు గళమెత్తుతున్నారు.
ఏ పనైనా చేస్తామని ముందుకు వచ్చినా వారికి పనిలో పెట్టకునేందుకు ఎవరు ముందుకు రారు. దీంతో మనుషులుగా పుట్టినా.. సాటి మనుషులు నుంచి వెలివేయబడ్డ పరిస్థితిలో.. బతుకు బండిని లాగేందుకు వారు నేర్చుకుందల్లా చపట్లు కొట్టడం.. యాచక వృత్తిని చేపట్టడం.. సంఘమే తమను వెలివేసిందని, సంఘంతో తమకు పనేముందని వారు బావించడం లేదు.. దోస్త్ మేరా దోస్త్ అంటూ సమాజ హితం కోరి వారు ఈ రద్దీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చేస్తున్న మంచి పనిని చూడండి..
ఒక్కసారిగా అందరూ ఎయిర్ హాస్టెస్ మాదిరగా అత్యంత సుందరంగా తయారయ్యారు. ఎయిర్ హాస్టస్ లే దారి తప్పి ఇలా వచ్చారా అనిపించేలా వచ్చిన వీరికి ఒక లీడర్ వుంది. అమె చేతిలో మైక్ కూడా వుంది. అంతే చకచకా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అగి.. వారు ఒక ప్రదర్శనను ఇచ్చారు. ఫ్టైట్ లో ఎయిర్ హాస్టస్ లు చెప్పినట్లుగా.. అటెన్షన్ ప్లీజ్ అన్నారు. ఈ లోపు మిగిలిన వారందరూ ట్రాఫిక్ ఆగిన వున్న చోట అక్కడక్కడా రోడ్డు పక్కన నిలబడ్డారు. ఈ లోపు మరో మారు వారికి ఇంకో వాయిస్ వినిపించింది. మీ అటెన్షన్ కోరుతున్నాం అని దగ్ధత స్వరంతో రెట్టింపు వేగంతో వాయిన్ వినిపించింది. అంతే అక్కడున్న వారంతా అటెన్షన్ కు వచ్చేశారు.
మీరు పైలెట్ లా దూసుకుపోవాలనుకుంటున్నారా..? అయితే మీకు కోన్ని విషయాలు తెలియాలి అంటూండగానే రోడ్డు పక్కన అక్కడక్కడా నిలపడిన వాళ్లు వాయిస్ కు అనూగూనంగా సైగలతో ప్రదర్శన చేస్తున్నారు. మీ కారులో ఆక్సిజన్ మాస్క్ లేదు, మీ సీటు కింద మీకెలాంటి లైప్ జాకెట్ లభించదు..కానీ మీకు సీటు బెల్టు వుంది. దానిని మీరేందు ధరించరు.. అని ప్రశ్నిస్తున్న స్వరం వినబడుతుంది. అంతేకాదు దానిని ధరించే విధానాన్ని కూడా చెబుతున్నారు. డ్రైవింగ్ సీటులో వున్నవారికి కుడి పక్కనున్న సీటు బెట్టును ముందు చేరుకుని దానిని మీ శరీరం గుండా లాగి ఎడమ వైపునున్న బకిల్ లో క్లిక్ మనే శబ్దం వచ్చేలా అమర్చాలి అంతే.. ఓ అల్లరి అమ్మాయి మీ బాయ్ ఫ్రెండ్ కు సీటు బెట్లు పెట్టుకోమ్మని చెప్పు.. ఓ స్మార్ట్ హీరో నన్ను కెమెరాలో బంధించడం ఆపి సీటు బెల్టు పెట్టకో, సీటు బెల్టు పెట్టుకున్న వారిని మాత్రమే మేం ఆశీర్వదిస్తాం అంటూ ముద్దుల కురిసిస్తున్నారు. వారు చెప్పింది బోధపడిందా..? సీటు బెల్టు పెట్టుకోండి.. ప్రమాదాలనుంచి రక్షణ పొందండి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more