No traffic jams in china says mla ravinder kumar

no traffic jams in china, china has no traffic jams, mla ravinder applauses china, mla ravinder says no traffic jams in china

No traffic jams in china says MLA ravinder kumar

ట్రాఫిక్ జామ్ అంటే ఏంటో తెలియదట..

Posted: 12/07/2014 07:59 PM IST
No traffic jams in china says mla ravinder kumar

చైనా సోషలిజం వైపు సాగుతూనే అభివృద్ధిని సాధించడం గొప్ప అనుభూతిని కలిగించిందని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆహ్వానం మేరకు 12 మంది సీపీఐ బృందంతో పాటు ఆయన పన్నెండురోజుల పాటు చైనాలో పర్యటించారు. చైనాలో తమ అనుభవాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘‘అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ కాదని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు అస్సులు జరగవని, జరిగినా అత్యంత అరుదుగా వుంటాయన్నారు.

మన కన్నా జనాభా అధికంగా వున్న దేశమైనా అక్కడ శాంతి, భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. అధిక జనాభా నియంత్రణకు ఒకే చైనాలో కుటుంబానికి ఒక్కరే సంతానం విధానాన్ని అమలు చేస్తున్నారు. చైనా అభివృద్ది విషయంలో అన్నింటికన్నా ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ప్లై ఓవర్ల నిర్మాణాలు వున్నాయన్నారు. అద్భుతాలకు నెలవైన నిర్మాణాలు వున్న దేశంగా చైనా తమ మనస్సును దోచేసిందన్నారు.
 
ప్రభుత్వ నియంత్రణలోనే మల్టీ నేషనల్ కంపెనీలు పనిచేయడం విశేషంగా ఆయన చెప్పుకోచ్చారు. తనతో పాటు ఏపీకి చెందిన హరినాథ్‌రెడ్డి, మహిళానేత సుల్తానా ఫైజీ, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వి.ఉల్లాఖాద్రీ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, అస్సాం, ఒడిశా, కేరళ, గోవా రాష్ట్రాల నాయకులు తమ ప్రతినిధి బృందంలో ఉన్నారని రవీంద్రకుమార్ చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : traffic jams  china  MLA ravindra kumar  

Other Articles