Central minister sushma swaraj wants gita recognised as a national scripture

bhagavad gita, central minister sushma swaraj, bjp, natinal scripture , gita , indian goverment , indian politics , rashtrya granth

Pressing for the Centre to declare Bhagavad Gita as a 'Rashtriya Granth' (national scripture)

కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం

Posted: 12/09/2014 12:22 PM IST
Central minister sushma swaraj wants gita recognised as a national scripture

కేంద్రంలో మంత్రులు సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందులవులవుతున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలు మరువక ముందే మరో కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలతో దేశంలో పెను తుఫాన్ ను సృష్టించారు. భగవద్గీత ను జాతీయ పవిత్ర గ్రంథంగా  ప్రకటించాలన్న కేంద్ర మంత్రి  శ్రీమతి సుష్మ స్వరాజ్ వ్యాఖ్యలపై ప్రతి పక్షాల నుండి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేత శశి థరూర్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భారతదేశం లో అన్ని గ్రంథాలను సమానంగా గౌరవిస్తారని కాని ఒక గ్రంథాన్ని  తీసుకొని పవిత్ర గ్రంథంగా ప్రకటించాలనుకోవటం సబబు కాదని అన్నారు. సమాజం లో ఒక వర్గం మత గ్రంథాన్ని దేశ ప్రజలందరి మీద బలవంతంగా ఎలా రుద్దుతారని పి ఎం కే వ్యవస్థాపకుడు రామదాసు అన్నారు. పలు మతాలు ఫరిడవిల్లుతున్న మన దేశం లో అన్ని మతాలను కేంద్రం సమానంగా పరిగణించాలని కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ ప్రతిపాదన ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని డి ఎం కే అధినేత కరుణానిధి విమర్శించారు. ప్రజలకు పలు రకాల మత విశ్వాసాలు ఉన్నపుడు భాద్యతాయుతమైన హొదా లో ఉన్న  కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము దారుణమని బి ఎస్ పి అధినేత్రి మాయావతి సుష్మ స్వరాజ్ పై విరుచుకుపడ్డారు. రాజ్యసభ లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు నోటీసు ఇచ్చానని.. దీనిపై వివరణ ఇవ్వాలని లేకుంటే పార్లమెంట్ ని స్తంభింప చేయనున్నట్లు సి పి ఐ నేత డి. రాజా తెలిపారు.

ఏది ఏమైనప్పటికీ కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ గారి వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఈ సున్నితమైన అంశం పై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  shashi thaur  congress  mayavathi  dmk  pmk  

Other Articles