Spicejet cancels 1800 flights till dec 31st spice jet crisis

spice jet crisis, civil aviation, king fisher crisis, spice jet cancelled flights, king fisher airlines crisis, kalanidhi maran , sun net work, dgca , domestic aviation

Cash-strapped SpiceJet has cancelled over 1,800 flights across the country for the current month, in signs of mounting troubles for the budget airline.

సంక్షోభంలో స్పైస్ జెట్

Posted: 12/09/2014 01:49 PM IST
Spicejet cancels 1800 flights till dec 31st spice jet crisis

రోజు రోజుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ పతనావస్థ లోకి జారుకొంటుంది. మూల ధన సమీకరణ కోసం ఎన్నో ప్రయత్నాలను ఆరంభించిన సంస్థ ప్రయాణికుల కోసం ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించి ముందస్తు బుకింగ్ లను ప్రారంభించింది. ఆ అవకాశాన్ని ప్రయాణికులు కూడా అదే స్థాయి లో ఉపయోగించారు. కాని ఆ అవకాశాన్ని  స్పైస్ జెట్ సంస్థ మూలధన సమీకరణ కోసం ఉపయోగించలేకపోయింది. ఏది ఏమైనా సంస్థ ఆర్థికంగా గట్టెక్కాలంటే 1500 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలని స్పైస్ జెట్ ఉద్యోగులు, ఆర్ధిక రంగ నిపుణులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఇబ్బందులు మరింత జటిలం అయ్యయ్యాన్న దానికి నిదర్శనంగా డిసెంబర్ 31 వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 1861 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ప్రకటించేసింది. ముందస్తు బుకింగ్ ల విషయం లో మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా డి.జి.సి.ఏ షోకాజు నోటీసు ఇవ్వాలని యోచిస్తున్న సమయంలో స్పైస్ జెట్ సంస్థ ఈ ప్రకటన చేయటం గమనార్హం. అయినప్పటికీ డి.జి.సి.ఏ స్పైస్ జెట్  సంస్థ తన యొక్క ముందస్తు బుకింగ్ లను ఆపేయాలని ఆదేశించింది.

గత మూడు నెలల నుండే స్పైస్ జెట్ సంస్థ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటుంది. సంస్థ లోని ఉద్యోగులు కూడా మెల్లిగా వలస బాట పట్టారు. గత నెలలో 18 మంది పైలట్లు ఒకే సారి సంస్థ ని వదిలేసారు.  కింగ్ ఫిషర్  సంస్థ లానే స్పైస్ జెట్ కూడా పతనమయ్యే అవకాశముందని ఆర్ధిక రంగ నిపుణులు ఎప్పటినుండో హెచ్చరించారు. ఇదంతా పక్కన పెడితే కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక గజపతి రాజు గారు  స్పైస్ జెట్ విమానయాన సంస్థ త్వరలోనే ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spice jet  aviation ministry  sun group  maran group  spice jet crisis  

Other Articles