The united nations has decided to name june 21 as the world yoga day

United Nations, united nations decission, june 21st, june 21st yoga day, international yoga day, narendra modi yoga, narendra modi yoga pic, world yoga day, yoga day, india yoga

United Nations on Thursday declared June 21 as the World Yoga Day. The decision, taken at the UN General Assembly, is being seen as a proud moment for India.

జూన్ 21 'అంతర్జాతీయ యోగా దినం'-మోడీ ప్రతిపాదనను అంగీకరించిన ఐ.రా.స

Posted: 12/12/2014 05:20 PM IST
The united nations has decided to name june 21 as the world yoga day

మూడు నెలల క్రితం... జరిగిన ఐ.రా.స సర్వ సభ్య సమావేశం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రపంచంలో ప్రశాంతతను నెలకొల్పటానికి అన్ని దేశాల్లో యోగ కు ప్రాముఖ్యతని ఇవ్వాలని కనుక సూర్యుడు భూమధ్య రేఖకు దూరంగా వెళ్ళే తేదిలలో ఒకటైన జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినంగా పాటించాలని అప్పుడు సూచించటం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలోచనకు మూడు నెలల్లోనే ఐక్యరాజ్య సమితిలో గొప్ప గౌరవం లభించింది. భారత్ నేతృత్వంలో చేసిన తీర్మానానికి ఐరాస సర్వ ప్రతినిధి సభ ఆమోదిస్తూ... జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించింది. మనిషి ఆరోగ్యానికి, ప్రశాంతతకి యోగ సంపూర్ణ విధానంగా తోడ్పడుతుందని పేర్కొంది. ఐ.రా.స కు భారత రాయబారి అశోక్ ముఖర్జీ అంతర్జాతీయ యోగా దినం తీర్మానాన్ని సర్వ ప్రతింది సభ లో ప్రవేశ పెట్టారు. 'ప్రపంచ ఆరోగ్య, విదేశీ విధానం' అజెండా కింద ఆమోదించిన ఈ తీర్మానం ద్వారా... ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినంగా పాటించాలని 193 దేశాలతో కూడిన ఐ.రా.స సర్వ సభ్య సమావేశం నిర్ణయించింది.  ఒక దేశం ప్రతిపాదించిన ఆలోచనను 90 రోజులైనా గడవకముందే ఇంత తక్కువ వ్యవధి లో అమలు చేయటం కూడా ఇదే తొలిసారి.

జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినంగా ఐ రా స ఆమోదించటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర హర్షం వెలి బుచ్చారు. జూన్ 21 న యోగ దినంగా ప్రకటించటంపై సంతోషాన్ని వర్ణించటానికి మాటలు చాలటం లేదని తన ట్విట్టర్ సందేశం లో పేర్కొన్నారు.  భారత్ తీర్మానికి మద్దతు తెలిపిన దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : united nations  world yoga day  india  narendra modi  

Other Articles