Sonia gandhi recovering well say doctors

Sonia Gandhi is recovering well, sonia recovering well, sonia suffering from lower respiratory tract infection, sonia recovering well says doctors, Sir Ganga Ram Hospital, New Delhi, Dr Arup Kumar Basu, senior consultant, respiratory medicine department

Congress President Sonia Gandhi, who has been hospitalised for lower respiratory tract infection, is stable and recovering well.

క్రమంగా కోలుకుంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ

Posted: 12/19/2014 08:40 PM IST
Sonia gandhi recovering well say doctors

అనారోగ్యం బారిన పడిన గత రాత్రి అస్పత్రిలో చేరిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధి క్రమంగా కోలుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలియజేశాయి. కాస్త అస్వస్థతకు గురైన సోనియాను నిన్నరాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతుండడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. సోనియా ఆస్పత్రిలో చేరారన్న వార్తతో పార్టీ శ్రేణుల్లో కలకలం మొదలైంది.
 
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు సోనియాను పరామర్శించేందుకు శుక్రవారం అస్పత్రికి తరలి వెళ్లారు. గత ఏడాది కూడా లోక్‌ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో సోనియా విషజ్వరంతో, ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరారు. 2008లో శీతాకాలంలో సోనియా ఆస్తమా, ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. 2011లోని అమెరికాలో ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  lung infection  recovering well  

Other Articles