Harvested heart airlifted to chennai after police stop traffic

harvested heart airlifted, heart airlifted from bangalore to chennai, Chennai hospital arrived at Manipal hospital, green corridor, HAL Airport here to Chennai, Heart transplantation, two years ten months old brain dead child, child aged two years and eight months., bangalore child after death saves chennai childs life, Hal airport, Chennai airport,

In a heart-warming action, the heart of a brain dead child was airlifted from HAL Airport here to Chennai for transplantation after police created a "green corridor" to enable its unhindered transportation.

ప్రాణం నిలిపేందుకు బెంగళూరు నుంచి చెన్నై ప్రయాణించిన చిన్నారి గుండె

Posted: 12/19/2014 09:23 PM IST
Harvested heart airlifted to chennai after police stop traffic

ఒకే నగరంలో ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి గుండెను పంపి.. అక్కడ గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేయడం ఈమధ్య కాలంలో మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. కానీ, ఏకంగా ఒక నగరం నుంచి మరో నగరానికి గుండెను తీసుకెళ్లిన సంఘటన మాత్రం తాజాగా జరిగింది. బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి చెన్నైకి ఓ చిన్నారి గుండెను తీసుకెళ్లి.. విజయవంతంగా అవతలి రోగికి అమర్చి అపరేషన్ సక్సెస్ చేశారు మన వైద్యులు.

బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో సుమారు రెండేళ్ల 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. మరోవైపు చెన్నైలో రెండేళ్ల 8 నెలల చిన్నారి గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తోంది. గుండె దానంగా ఇచ్చేందుకు చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించడంతో బెంగళూరు నుంచి చెన్నైకి గుండెను తరలించి అపరేషన్ ను విజయవంతం చేశారు వైద్యులు. అయితే చెన్నైలో విమానం లాండ్ అవ్వడంతోనే పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేశారు. విమానాశ్రయం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వున్న ధూరాన్ని అత్యంత తక్కువ సమయంలో తీసుకురాగలిగారు అంబులెన్స్ డ్రైవర్లు. దీంతో హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి గుండెను తరలించారు. చెన్నైలోని చిన్నారికి గుండెను అమర్చడంలో సఫలీకృతులయ్యారు వైద్యులు. చిన్నారి త్వరలోనే కోలుకుంటుందని భరోసా ఇస్తున్నారు. గత సెప్టెంబర్ నెలలో కూడా ఇలాగే బ్రెయిన్ హెమరేజితో మరణించిన మహిళ గుండెను బెంగళూరు నుంచి చెన్నైకి తరలించారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heart transplantation  heart airlifted  bangalore  chennai  

Other Articles