Taliban death squad posed for pictures before slaughtering 132 children

pakistan terrorism, terrorism activities in pakistan., terrorism activities in india, Fazlullah, Fazlullah death, Maulana Fazlullah

Peshawar atrocity is said to have been ordered by Maulana Fazlullah, head of the Taliban in Pakistan died

పెషావర్ ఘటన కర్కోట ఘాతకుడి హతం

Posted: 12/20/2014 12:37 PM IST
Taliban death squad posed for pictures before slaughtering 132 children

గత రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెషావర్ దారుణమైన ఘటనకు కారకుడైన కిరాతకున్ని పాక్ ఆర్మీ కాల్చి చంపెసినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ లో పెషావర్ ఘాతుకానికి సూత్రదారిగా భావిస్తున్న తాలిబన్ నాయకుడు ఫజులుల్లా హతమైనట్లు సమాచారం. ఈ మేరకు పాక్ మీడియాలో విస్తృతంగా కదనాలు వచ్చాయి. ఆప్ఘన్ సరిహద్దులలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై పాక్ సైన్యం పెద్ద ఎత్తున దాడులు జరుపుతోంది. గత రెండు రోజులలో సుమారు అరవై మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పెషావర్ ఘటనలో 140 మంది పిల్లలను బలిగొన్న తాలిబన్లను అంతం చేయడానికి పాక్ కూడా నడుం భిగించింది. ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమైనదో ఇటీవల వివిద ముస్లిం దేశాలలో అనుభవం అవుతోంది. నైజీరియలో చివరికి తిరుగుబాటు బోకో హరామ్ ఉగ్రవాదులతో నిరంతరం యుద్దం చేయవలసి వస్తోంది. బోకో హరామ్ తీవ్రవాదులు పెద్ద ఎత్తున హత్యలు చేస్తున్నారు.ఈ సందర్భంలో వారిపై యుద్దానికి వెనుకాడిన అరవై మంది సైనికులను పైజీరియాలో ఉరి శిక్ష వేశారంటే పరిస్థితి ఏ విదంగా ఉందో తెలుస్తుంది. ఏది ఏమైనా ఆ పెషావర్ సైనిక పాటశాల పై ఘాతుకానికి ఒడి కట్టిన కరోతకున్ని ఆర్మీ చంపినట్లు తెలుస్తుంది. దీనిపై ప్రపంచ దేశాలు తీవ్ర హర్షం వేలిబుచ్చుతున్నాయి. ఇప్పటికే తీవ్ర వాదం పై ప్రపంచ దేశాలు ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే.

ఉగ్రవాదం వల్ల అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అనేక మంది అమాయక ప్రజలు ఉగ్రవాద మృత్యు క్రీడ కు బలి అవుతున్నారు. దీని పట్ల కఠినంగా వ్యవహారించాలని ఇటీవల జరిగిన ఐరాస లో జరిగిన సమావేశాల్లో కూడా తీర్మానించారు. ఆస్ట్రేలియాలో జరిగిన జి 20 సమావేశం లో కూడా ఉగ్రవాదన్ని ఉపేక్షించరాదని అన్ని దేశాలు కఠిన వైఖరి అవలంభించాలని తీర్మానించిన విషయం తెలిసిందే.

హరి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maulana Fazlullah  pakistan terrorism  peshawar incident  head of the taliban  

Other Articles