దక్షిణాది చలన చిత్రాల ప్రముఖ దర్శకుడు సందేశాత్మక చిత్రాల తెరకెక్కించడంలో అగ్రగన్యుడు కె.బాలచందర్ పరమపదించారు. ఆయన పూర్తి పేరు కైలసం బాలచందర్. 84 ఏళ్ల ఆయన ఈ నెల 16న ఆనారోగ్యంతో చెన్నై నగరంలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఎక్కువ కావడంతో డయాలసిస్ చేశారు. పరిస్థితి మరింత విషమించడంతో ఆయనను చివరకు వెంటిలేటర్ మీద ఉంచి కూడా వైద్యం అందించారు. కానీ, వార్ధక్యం కారణంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో మరణించారని వైద్యులు తెలిపారు.
బాలచందర్‌కు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే సినిమాలపై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలో 12వ ఏటే థియేటర్ ఆర్టిస్ట్ సంఘంలో సభ్యులయ్యారు. ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన తొలుత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. చెన్నై మహానగరంలోకి అకౌంట్ క్లర్క్‌గా అడుగుపెట్టారు. ఆ తరువాత యునెటెడ్ అమెరికన్ ఆర్టిస్టు నటన కంపెనీలో చేరారు. అనంతరం అతి త్వరలోనే తన కంటూ సొంతంగా డ్రామా గ్రూప్‌ను తయారు చేసుకుని మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని రూపొందించి దర్శకత్వం వహించారు. ఆ తరువాత అదే నాటకంతో వెండితెరపై దర్శకుడిగా అవతరించారు.
దక్షణాధిలో తనకంటూ స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న బాలచందర్ అనేక మంది ప్రముఖ నటులను సినీ ఇండస్ట్రీకి అందించారు. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్‌రాజ్, సరిత, వివేక్ వంటి ప్రముఖ నటీనటులందరినీ వెండి తెరకు పరిచయం చేసింది ఆయనే. తమిళం, తెలుగు బాషలతో పాటు బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఆయన, అన్ని బాషలలోనూ కలిపి సుమారు 100 చిత్రాలకుపైగా ఆయన దర్శకత్వం వహించారు. భారతీయ సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్ని సూపర్ హిట్ కావడం మరో విశేషం.
ఎంజీఆర్ హీరోగా చేసిన దైవతాయ్ చిత్రానికి సంభాషణల రచయితగా సినీరంగంలో ప్రవేశించిన బాలచందర్.. ఇంతింతై వటుడింతై అన్న చందంగా కాలీవుడ్ లో ఎదిగారు. తన సినిమాలు కేవలం తమిళులకే పరిమితం కాకూడదని వాటిని తెలుగు, కన్నడ, మళయాలం, హందీ బాషల్లోనూ రూపొందించారు. దక్షిణాది తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన చేసని సేవలకు గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అక్కినేని అంతర్జాతీయ పురస్కారం’ అందుకున్నారు. తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డలను అందుకున్నారు. పద్మశ్రీ భిరుదుతో కూడా కేంద్ర ప్రభుత్వం అయనను సత్కరించింది. ఇది కథ కాదు, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, రుద్రవీణ.. ఇలాంటి అద్భుత చిత్రరాజాలన్నీ ఆయన దర్శకత్వం నుంచి జాలువారిన చిత్రాలే. ఈ చిత్రాలతో ఆయనలోని ప్రతిభను చాటిచెప్పాయి.
బాలచందర్ మరణ వార్తతో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాలచందర్ మరణవార్తతో అటు కాలీవుడ్, టాలీవుడ్; సాండిల్ వుడ్ సహా బాలీవుడ్ లలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు బాలచందర్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బాలచందర్ అభిమానులు శోకసంధ్రంలో మునిగారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more