Nda government propose atal bihari vajpayee madan mohan malaviya bharat ratna

bharat ratna for Atal Bihari Vajpayee, Atal Bihari Vajpayee ruling period development, Atal Bihari Vajpayee updates, Atal Bihari Vajpayee latest photos, modi on Atal Bihari Vajpayee, madan mohan malaviya bharatratna, madan mohan malaviya latest updates, nda government programmes, narendra modi latest updates, bharat ratna persons list

nda government propose Atal Bihari Vajpayee Madan Mohan Malaviya Bharat Ratna : sources says that nda government proposed to announce bharat ratna to former prime minister of india atal bihari vajpayee and madan mohan malaviya

వాజ్ పాయ్ పుట్టినరోజు కానుక ప్రకటనకు కేంద్రం సిద్ధం

Posted: 12/24/2014 07:49 AM IST
Nda government propose atal bihari vajpayee madan mohan malaviya bharat ratna

దేశాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించిన మాజి ప్రధాని.., బీజేపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన వాజ్ పాయ్ కు పుట్టినరోజు కానుకను ప్రకటించేందుకు నరేంద్రమోడి సర్కారు సన్నద్దమవుతోంది. ఎప్పట్నుంచో ఇవ్వాలని కోరుతున్న ‘భారతరత్న’ పురస్కారంను పుట్టినరోజు కానుకగా అందించనుంది. వాజ్ పాయ్ కు భారత రత్న అందించాలని రాష్ర్టపతికి కేంద్రం ఇవాళ సిఫార్సు చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ 25 వాజ్ పాయ్ పుట్టినరోజు కావటంతో ఒకరోజు ముందుగా రాష్ర్టపతికి పంపి.., ఈ సాయంత్రం లేదా, రేపు స్వయంగా ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వ నిర్ణయంపై ప్రకటన చేస్తారని అధికార వర్గాలు చెప్తున్నాయి.

వాజ్ పాయ్ తో పాటు ప్రముఖ విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యాకు కూడా భారత రత్న అందించాలని రాష్ర్టపతిని కేంద్రం కోరనుంది. ప్రముఖులిద్దరికీ పురస్కారం ప్రకటించాలని ప్రణబ్ కు ప్రతిపాదనలు పంపనుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం సచిన్ కు భారతరత్న ప్రకటించిన సమయంలోనే వాజ్ పాయ్ కు కూడా ఇవ్వాలని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ బలంగా డిమాండ్ చేసింది. అయితే కోరిక నెరవేరలేదు. దీంతో అధికారంలో ఉండగా అయినా తమ కలను నిజం చేసుకుని పార్టీ కురవృద్ధుడిని గౌరవించుకోవాలని చూస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atal Bihari Vajpayee latest  madan mohan malaviya updates  bharat ratna  

Other Articles